ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kutami: ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన యార్లగడ్డ వెంకట్రావు

ABN, Publish Date - Apr 07 , 2024 | 11:50 AM

ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ రామవరప్పాడు శివారు నెహ్రూ నగర్ కట్టపై ఎన్డీయే కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో (AP Politics) ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ రామవరప్పాడు శివారు నెహ్రూ నగర్ కట్టపై ఎన్డీయే కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatarao) ఎన్నికల ప్రచారం (Election Campaign) ముమ్మరం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. గడపగడపకు తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలు (Super Six Schemes) పాంప్లెట్ల ద్వారా ప్రజలకు యార్లగడ్డ వెంకట్రావు వివరిస్తున్నారు.

ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అధికారంలోకి వస్తే తప్ప.. రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక యువత వలస వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. ఆగిపోయిన పోలవరం కట్టాలన్నా, అమరావతి రాజధాని కట్టాలన్నా, ఐటీ పరిశ్రమలు రావాలన్నా తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రావాలని చెప్పారు.

కాగా చంద్రబాబు నాయుడి సమర్థ నాయకత్వం, సుపరి పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు విశ్వసి స్తున్నారని, మూడు పార్టీల కూటమితోనే ప్రజాసం క్షేమం, రాష్ట్రం సర్వతోముఖాభివృద్థి సాధ్యమని వైసీపీ నాయకులు, కార్యకర్తలు గ్రహించారని, అందుకే వైసీపీని వీడి స్వచ్ఛందంగా టీడీపీలోకి చేరుతున్నారని మండలంలోని నాగవరప్పాడు, వెల్దిపాడు, కొయ్యగూరపాడు, ఎలుకపాడు గ్రామాలకు చెందిన సుమారు 300 మంది బీసీ, ఎస్సీ కార్యకర్తలు వైసీపీని వీడి యార్లగడ్డ సమక్షంలో తెలుగుదేశంపార్టీలో చేరారు.

Updated Date - Apr 07 , 2024 | 11:50 AM

Advertising
Advertising