ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sharmila: ఇది పిరికిపందల చర్య తప్ప మరొకటి కాదు: షర్మిల

ABN, Publish Date - Jun 09 , 2024 | 01:09 PM

అమరావతి: రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..

అమరావతి: రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై (YSR Statue) అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీవ్రంగా ఖండిస్తోందని ఏపీసీసీ చీఫ్ (APCC Chief) వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం అమరావతి (Amaravati)లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణమని, మిక్కిలి శోచనీయమని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందేనన్నారు. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదని షర్మిల అన్నారు.


తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) విశేష ప్రజాదరణ పొందిన నాయకుడని, తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకమని షర్మిల వ్యాఖ్యానించారు. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదని.. గెలుపు ఓటములు ఆపాదించడం తగదన్నారు. వైఎస్సార్‌ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు.. బాధ్యులైన వారిని వెంటనే పట్టుకుని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని షర్మిలా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రామోజీరావుకు ప్రముఖుల నివాళి.. (ఫోటో గ్యాలరీ)

ఆ రాత్రి చేసిన తప్పే.. జగన్ ఓటిమికి కారణం..

వైఎస్ జగన్ ఈవీఎంలపై నెపం...

ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Read more!

Updated Date - Jun 09 , 2024 | 02:00 PM

Advertising
Advertising