Varraravinder Reddy: వర్రారవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్డ్‌లో కీలక అంశాలు
ABN, Publish Date - Nov 12 , 2024 | 04:01 PM
Andhrapradesh: ‘‘2020 నుంచి ఐపాక్ టీం కంటెంట్ ఇస్తే తమలాంటి వాళ్ళు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేవాళ్లం. జగనే కావాలి, జగనన్న రావాలి యాప్‌లో పోస్టులు చేసేవాళ్ళం. ఎన్నికలకు ముందు నుంచి వైసీపీకి వ్యతిరేకంగా టీవీ చానల్స్ డిబేట్లో మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకునే వాళ్ళం’’ రిమాండ్ రిపోర్టులో వర్రా రవీందర్ రెడ్డి తెలిపారు.
కడప, నవంబర్ 12: సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేసిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డికి (Varra Ravinder Reddy) కడప రెండో అదనపు మెజి స్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే రవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. ‘‘2020 నుంచి ఐపాక్ టీం కంటెంట్ ఇస్తే తమలాంటి వాళ్ళు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేవాళ్లం. జగనే కావాలి, జగనన్న రావాలి యాప్‌లో పోస్టులు చేసేవాళ్ళం. ఎన్నికలకు ముందు నుంచి వైసీపీకి వ్యతిరేకంగా టీవీ చానల్స్ డిబేట్లో మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకునే వాళ్ళం.. ఆ నాయకులపైన, వారి కుటుంబ సభ్యులపైన వ్యక్తిగతంగా పోస్టులు పెట్టే వాళ్ళం. వైఎస్సార్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనల మేరకు పోస్టులు పెట్టేవాళ్ళం’’ రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
Attack on Collector: వికారాబాద్ ఘటనపై ఏడీజీ కీలక నివేదిక
‘‘2022లో సజ్జల భార్గవ రెడ్డి బాధ్యతలు తీసుకున్నక మరింత రెచ్చిపోయాం . మూడు రాజధానుల విషయంలో జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని సజ్జల భార్గవరెడ్డి నన్ను బెదిరించాడు. 2023 నుంచి నా ఫేస్‌బుక్ ఐడీ పాస్‌వర్డ్ సజ్జల భార్గవరెడ్డి దగ్గర పెట్టుకొని అందులో పోస్టులు చేసేవాడు. 2023 జనవరిలో షర్మిల, సునీత, విజయమ్మకు వ్యతిరేకంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టాము. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి మాకు కంటెంట్ ఇచ్చారు. వీరిపై ఎలా పోస్టులు పెట్టాలనేది అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి చర్చించుకునేవారు. 2023 సెప్టెంబర్‌లో పవన్ కళ్యాణ్ మీద, వారి పిల్లలపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టాను. వాటిని తొలగించాలని సిద్ధవటానికి చెందిన వెంకటాద్రి అనే వ్యక్తి నా దగ్గరికి వస్తే.. రెండు లక్షలు ఇస్తే తీసేస్తానని బెదిరించి పంపాను. వైసీపీ సోషల్ మీడియాలో సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి, సుమ రెడ్డి కీలకంగా వ్యవహరించేవారు’’ అంటూ వర్రా రవీందర్ రెడ్డి పోలీసులు పేర్కొన్నారు.
కాగా.. రవీందర్ రెడ్డికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అలాగే ఈ కేసులో అరెస్టయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్, సుబ్బారెడ్డిలకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని పోలీసులకు జడ్జి తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వర్రాపై కేసులు నమోదు అవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, పీసీసీ చీఫ్ షర్మిల సహా కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టిన పాపం ఇప్పుడు వర్రాను వెంటాడుతోంది. ఇటీవల కడప చిన్నచౌక్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లినప్పుడు ఎంపీ అవినాశ్‌రెడ్డి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పించారు. దీంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌తో పాటు చిన్నచౌక్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో తేజోమూర్తిపై వేటు పడిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
Cybercriminals: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. కాజేసిన డబ్బు అమాయకుల ఖాతాలకు..
BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్
Read Latest AP News And Telangana News
Updated Date - Nov 12 , 2024 | 04:15 PM