ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజల పక్షాన నిరంతర పోరాటం

ABN, Publish Date - Dec 27 , 2024 | 11:56 PM

ప్రజల పక్షాన నిలుస్తూ పోరాటం చేస్తామని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తెలిపారు.

నంద్యాలలో ఎస్‌ఈకి వినతి పత్రం ఇస్తున్న వైసీపీ నాయకులు

నంద్యాల రూరల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రజల పక్షాన నిలుస్తూ పోరాటం చేస్తామని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తెలిపారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ నంద్యాల పట్టణంలోని సాయిబాబానగర్‌ నుంచి విద్యుత్‌ కార్యాలయం వరకు వైసీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎస్‌ఈ సుధాకర్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. శిల్పా రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ భారం దాదాపుగా రూ.15485 కోట్ల అదనపు మోపడం దారుణమని అన్నారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించే దాకా పోరాడతామని హెచ్చరించారు. ప్రజలకు ఎన్నో మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇషాక్‌బాషా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాబున్నీసా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, తదితరులు పొల్గొన్నారు.

ఆత్మకూరు(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలను పెంచబోమని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి రాగానే ప్రజలు విద్యుత్‌ భారాలు మోపడం సరికాదని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆత్మకూరు వైసీపీ కార్యాలయం నుంచి బైకు ర్యాలీగా పట్టణ శివార్లలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీశైల నియోజకవర్గం టీడీపీ నాయకులు మద్యం, రేషన్‌, రియల్‌ ఎస్టేట్‌ ఏదీ వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం విద్యుత్‌ శాఖ డీఈ రామసుబ్రమణ్యంకు వినతిపత్రాన్ని అందజేశారు. ఇదిలావుంటే వైసీపీ నాయకుల బైక్‌ ర్యాలీకి పోలీసులు అనుమతుల్లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్బన్‌ సీఐ రాము అడ్డుకునే ప్రయత్నం చేయగా కేసులకు భయపడేదే లేదంటూ బైక్‌ ర్యాలీ కొనసాగించారు. నాయకులు మోమిన్‌ అహ్మద్‌హుసేన్‌, సయ్యద్‌మీర్‌, అంజాద్‌బాషా, కుంటా శివారెడ్డి, మునీర్‌ బాషా, లాలం రమేష్‌, అంబాల ప్రభాకరరెడ్డి, ఈశ్వరప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

నందికొట్కూరు(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్‌ చార్జీలను పెంచిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ధార సుధీర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని పటేల్‌ సెంటర్‌ నుంచి విద్యుత్‌శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పెంచిన విద్యుత్‌ చార్జీలనె తగ్గించాలంటూ విద్యుత్‌శాఖ డీఈ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ధార సుధీర్‌ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న పరిపాలనపై రాష్ట్ర ప్రజలు విసుగెత్తి పోయారన్నారు. కౌన్సిలర్‌ నాయబ్‌ వైసీపీ నాయకులు మన్సూర్‌, నాగిరెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి, సోముల సుధాకర్‌ రెడ్డి, కోకిల రమణారెడ్డి, రమణ, చంద్రారెడ్డి, రమేష్‌నాయుడు, అక్తర్‌, అశోక్‌రెడ్డి, నారాయణరెడ్డి, సులోచనమ్మ, జబ్బార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:56 PM