ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమిత్‌ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలి

ABN, Publish Date - Dec 22 , 2024 | 12:47 AM

హోంశాఖ మంత్రి అమిత్‌ షా అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నరసింహులు డిమాండ్‌ చేశారు.

పాణ్యంలో రాస్తారోకో చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు

నందికొట్కూరు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): హోంశాఖ మంత్రి అమిత్‌ షా అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నరసింహులు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, ఐఎ్‌ఫటీయూ, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. నరసింహులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అమిత్‌ షాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎం. గోపాల్‌, ఐఎ్‌ఫటీయూ డివిజన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వరగౌడ్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు గోవిందు, కార్యదర్శి శేఖర్‌, మున్సిపల్‌ డైలీ వేజ్‌ యూనియన్‌ నాయకులు కృష్ణ, సురేష్‌, పెద్ద రామన్న, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

పాణ్యం(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను మంత్రిపదవి నుంచి తొలగించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. శనివారం స్థానిక బ స్టాండు కూడలిలో నాయకులు రాస్తారోకో చేపట్టారు. సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు అరుణ్‌కుమార్‌, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు శివకృష్ణ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతను అవమానించడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో వనం రాజు, వెంకటాద్రి, రాజా, ప్రతాప్‌, సతీష్‌, నాగరాజు, గిరి, చంద్ర, గోవిందు, అక్బర్‌, మెహబూబ్‌ పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను పార్లమెంట్‌లో కించపరిచేలా కేంద్ర మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు చేయడం అమానుషమని ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ నాగన్న, ప్రజాసంఘాల నాయకులు మల్లె ఎలీషా, శీలం శేషు, మల్లయ్య, రమే్‌షకుమార్‌, కేశాలు అన్నారు. శనివారం ఆత్మకూరు పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్‌ స్ఫూర్తి కేంద్రంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. తక్షణమే ఆయన్ని పార్లమెంట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి అమిత్‌షా తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా కేంద్ర మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 23వ తేదిన ఆత్మకూరులో భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 12:47 AM