ప్రణాళికతో చదివితే విజయం తథ్యం
ABN, Publish Date - Dec 20 , 2024 | 12:13 AM
ప్రణాళికాతో చదివితే విజయం సాధించవచ్చని టీటీడీ ఏఏవో బాలగోవింద్ విద్యార్థులకు సూచించారు.
పగిడ్యాల, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రణాళికాతో చదివితే విజయం సాధించవచ్చని టీటీడీ ఏఏవో బాలగోవింద్ విద్యార్థులకు సూచించారు. పరీక్షలకు సన్నద్ధంపై పగిడ్యాల జడ్పీ హైస్కూలులో పదో తరగతి విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ తాను కూడా ఈ పాఠశాలలోనే చదువుకొని ఉన్నతమైన ఉద్యోగం సాధించానని చెప్పారు. పరీక్షలపై ఎలాంటి భయం వద్దని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. విద్యార్థుల కోసం తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. అనంతరం బాలగోవిద్‌ను ఉపాధ్యాయులు సన్మానించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మధుసూదన్‌రావు, ఉపాధ్యా యులు రషిద్‌మియ్య, రమణరావు, పీతాంబరరెడ్డి తదితరులు ఉన్నారు.
Updated Date - Dec 20 , 2024 | 12:13 AM