ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: సొంత పార్టీ నేతలపైనే బైరెడ్డి పరోక్ష విమర్శలు

ABN, Publish Date - Feb 02 , 2024 | 04:38 PM

Andhrapradesh: సొంత పార్టీ నేతలను ఉద్దేశించి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ కార్యకర్తలకు పరిచయ కార్యక్రమంలో బైరెడ్డి పాల్గొన్నారు.

నంద్యాల, ఫిబ్రవరి 2: సొంత పార్టీ నేతలను ఉద్దేశించి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్‌రెడ్డి (SAAP Chairman Byreddy Siddharth Reddy) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి. నందికొట్కూరు నియోజకవర్గానికి నూతన వైసీపీ సమన్వయకర్తగా నియమితులైన డాక్టర్ సుధీర్‌ను కార్యకర్తలకు పరిచయం చేసే కార్యక్రమంలో బైరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సొంత పార్టీ నేతలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పక్క నియోజకవర్గం నాయకులు ఇక్కడ రాజకీయం చేయాలని చూశారన్నారు. ‘‘మీ నియోజకవర్గంలో నేను రాజకీయం చేస్తే మీకు డిపాజిట్లు రావు’’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే ఎన్నికలలో గౌరు వెంకటరెడ్డి, మాండ్ర శివనందా రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు తాజా ఎమ్మెల్యే వచ్చి నందికొట్కూరు అభివృద్ధికి ఓటు వేయాలని అడుగుతారన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్ టీడీపీ పార్టీలోకి పోతున్నారంటూ బైరెడ్డి పరోక్షంగా విమర్శించారు. నందికొట్కూరు అభివృద్ధి కోసం తాను సీఎంకు అర్జీలు ఇస్తుంటే ప్రోటోకాల్ కోసం ఇక్కడ కొట్లాడుతున్నారంటూ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 02 , 2024 | 04:58 PM

Advertising
Advertising