Christmas Celebrations in Nandyal district
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:52 AM
నంద్యాల జిల్లాలో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు బుధవారం ఘనంగా నిర్వహించారు.
నంద్యాల జిల్లాలో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు బుధవారం ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఫాదర్లు యేసు సందేశాన్ని వినిపించారు. ప్రముఖులు ప్రార్థన మందిరాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకున్నారు. క్రైస్తవులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. శిలువ ఊరేగింపు నిర్వహించారు. మత పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యేసు సూచించిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. సర్వమానవాళికి ప్రేమసందేశం అందించిన సంతోషకరమైన శుభదినమే క్రిస్మస్ అని చెప్పారు.
Updated Date - Dec 26 , 2024 | 12:52 AM