Share News

Collector Srinivasulu: చిరుతపులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ శ్రీనివాసులు

ABN , Publish Date - Jun 26 , 2024 | 07:22 PM

మహానంది, రుద్రవరం, సిరివెళ్ల (Sirivella) అటవీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు(Collector Srinivasulu) సూచించారు. మూడ్రోజులపాటు సమీప గ్రామాలలో దండోరా వేయించాలని తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Collector Srinivasulu: చిరుతపులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ శ్రీనివాసులు

నంద్యాల: మహానంది, రుద్రవరం, సిరివెళ్ల(Sirivella) అటవీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి (Leopard) సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు (Collector Srinivasulu) సూచించారు. మూడ్రోజులపాటు సమీప గ్రామాల్లో దండోరా వేయించాలని తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సిరివెళ్ల మండలం పచ్చర్ల(Pacharla) సమీపంలో నిన్న(మంగళవారం) కట్టెల కోసం వెళ్లిన మహిళపై దాడి చేసి చిరుతపులి చంపిన నేపథ్యంలో కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. అటవీ చెక్‌పోస్టుల వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ పులుల సంచారంపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పచ్చర్ల సమీపంలో చిరుతపులి కోసం అటవీ సిబ్బంది వేట మెుదలుపెట్టారు. ప్రత్యేక సీసీ కెమెరాలు, బోన్ ఏర్పాటు చేసి పులిని బంధించేందుకు రంగంలోకి దిగారు.

ఇవి కూడా చదవండి:

AP Politics: ఈనెల 28న టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ బాధ్యతలు..

AP Govt: జీఏడీలో రిపోర్టు చేసిన కలెక్టర్లు మాధవీలత, వేణుగోపాల్ రెడ్డి..

AP Politics: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పద్మశ్రీ, రాకేశ్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు..

Updated Date - Jun 26 , 2024 | 07:25 PM