ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరద బాధితులకు విరాళాలు

ABN, Publish Date - Sep 17 , 2024 | 12:13 AM

విజయవాడ వరద బాధితుల సహా యార్థం మండలంలోని శింగవరం టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి రూ.60వేల నగదు అందజేశారు.

విరాళాన్ని ఎమ్మెల్యేకు అందజేస్తున్న మాధవరం నాయకులు

బండిఆత్మకూరు, సెప్టెంబరు 16: విజయవాడ వరద బాధితుల సహా యార్థం మండలంలోని శింగవరం టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి రూ.60వేల నగదు అందజేశారు. సోమవారం వారు గ్రామంలో సేకరిం చిన నగదును విజయవాడ వరద బాధితుల సహాయార్థం అందజేశారు. అలాగే బండిఆత్మకూరు టీడీపీ నాయకులు రూ. 1,05,000 నగదును అందజేశారు. కార్యక్రమాల్లో సుబ్బారెడ్డి, జాకీర్‌, నందయ్య, రామసుబ్బయ్య, నబీరసూల్‌, ధనుంజయగౌడ్‌, మణికంఠ, నాగేంద్ర, రంగస్వామి, నారాయణ పాల్గొన్నారు.

మిడుతూరు: మిడుతూరు, సుంకేసుల, వీపనగండ్ల, నాగలూటి గ్రామాల్లోని ఏబీఎం చర్చిల ద్వారా సంఘకాపరి కె.ఇమ్మానియేల్‌ నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆధ్వర్యంలో రూ.1.5 లక్షలు విరాళాలు సేకరించారు. ఈ నగదుతో వరద బాధితులకు నిత్యావసర సరుకులు బియ్యం, కంది పప్పు, మంచినూనె, కూరగాయల కిట్లను 400 కుటుంబాలకు మిడుతూరు ఏబీఎం చర్చి దగ్గర నుంచి విజయవాడకు వాహనం ద్వార తరలించి వరద బాదితులకు పంపిణీ చేసినట్లు సంఘ పెద్దలు తెలిపారు. సంఘ పెద్దలు పాల్గొన్నారు.

ఆత్మకూరు రూరల్‌: విజయవాడ నగరంలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఇచ్చిన పిలుపునకు విశేషమైన స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పువ్వాడి భాస్కర్‌ రూ.లక్ష, గౌరి శంకర్‌ గ్యాస్‌ ఏజెన్సీ తరపున రూ.25 వేలు, మహానంది మండల పొదుపు సంఘం తరపున 3,42,550, మహానంది ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని రూ.50 వేలు, బోడమ్మనూరు వెంకటరెడ్డి రూ.2 లక్షలు, గాయత్రి విశ్వకర్మ సేవాసంఘం ఆత్మకూరు తరపున రూ.10 వేలు, హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ కలీముల్లా రూ.20 వేలు, విశ్రాంత ఈఈ సుధాకరరెడ్డి రూ.25 వేలు, నల్లకాలువ సర్పంచ్‌ వెంకటరమణ 10,101 వ్యక్తిగత విరాళాలతో పాటు వివిధ గ్రామాలు, సంఘాల తరపున ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి అందజేశారు.

వెలుగోడు: మండలంలోని మాధవరం టీడీపీ నాయకులు రూ1,78,000 నగదు సహాయాన్ని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి అందజేశారు. ఈ సహాయం విజయవాడ వరద భాధితుల సహాయార్థం విరాళాలు సేకరించి అందజేశామని టీడీపీ నాయకులు చెప్పారు.

నంద్యాల రూరల్‌: విజయవాడ వరదబాధితులకు సీఎం సహాయ నిధికి నంద్యాల జిల్లా ఎలక్ర్టికల్‌ కాంట్రాక్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూ.1.50లక్షల చెక్కును ఆ సంఘం నాయకులు వాకా వరప్రసాద యాదవ్‌, మధుశేఖర్‌ మంత్రి ఫరూక్‌కు సోమవారం అందజేశారు. తమవంతు సాయంగా అందజేసి నట్లు వారు చెప్పారు. మాజీ కౌన్సిలర్‌ శివశంకర్‌ యాదవ్‌, విజయశేఖర్‌, శరత్‌కుమార్‌, అసోసియేషన్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

విజయవాడలోని వరద బాధితులకు నంద్యాల గురురాఘవేంద్ర విద్యా సంస్థల యాజమాన్యం బాసటగా నిలిచింది. వెయ్యి కుటుంబాలకు పది కిలోల చొప్పున బియ్యం ప్యాకెట్లు, సీఎం సహాయ నిధికి రూ.2.50 లక్షల విరాళం అందజేయనున్నట్లు గురురాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్‌ డా.దస్తగిరిరెడ్డి తెలిపారు. సోమవారం బియ్యం బస్తాల లారీలను విజయవాడకు తరలించారు. డా.దస్తగిరిరెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్‌ డా.రామకృష్ణారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా.రవి కృష్ణలు హాజరై జెండా ఊపి లారీని ప్రారంభించారు. విద్యాసంస్థల డైరెక్టర్లు మౌలాలిరెడ్డి, షేక్షావలిరెడ్డి, నంద్యాల లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 12:13 AM

Advertising
Advertising