ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహానందిలో గజవాహనంపై అమ్మవారు

ABN, Publish Date - Oct 08 , 2024 | 12:42 AM

మహానంది క్షేత్రంలో దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కామేశ్వరీదేవిని అర్చకులు స్కందమాత దుర్గగా అలంకరించి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు.

మహానందిలో గజవాహనంపై విహరిస్తున్న అమ్మవారు

మహానంది, అక్టోబరు 7: మహానంది క్షేత్రంలో దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కామేశ్వరీదేవిని అర్చకులు స్కందమాత దుర్గగా అలంకరించి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని ప్రత్యేక యాగశాల మంటపంలో వేదపండితులు రవిశంకర్‌ అవధాని ఆధ్వర్యంలో అర్చకులు, రుత్వికులు ఉదయం నుంచి చండీ హోమం, పారాయణం, హోమాలతో పాటు కుంకుమార్చన పూజలను వేదమంత్రాలతో జరిపారు. సాయంకాలం 6 గంటల నుంచి అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. గజవాహనంపై అమ్మవారిని ఆశీనులుజేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఏఈవో ఎర్రమల్ల మధు, దేవస్ధానం నిత్యాన్నదాన సత్రం కూరగాయల దాత లక్కబోయిన ప్రసాద్‌, ఆదిలక్షమ్మ దంపతులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2024 | 12:42 AM