ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: డీఈవో

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:35 AM

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డీఈవో జనార్దన్‌రెడ్డి అన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో జనార్దన్‌రెడ్డి

గడివేముల, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డీఈవో జనార్దన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ పాఠశాలను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పదోతరగతి, ఇంటర్‌ విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్య ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలని సూచించారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని అన్నారు. సులభ రీతిలో విద్యార్థులకు బోదన చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థి సామార్థ్యాన్ని పెంచే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని అన్నారు. రికార్డులను పరిశీలించారు. ఎంఈవో విమల వసుంధరాదేవి, కేజీబీవీ ప్రిన్సిపాల్‌ రుబినా అఫ్రిన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 12:35 AM