ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏకధాటిగా వర్షం

ABN, Publish Date - Sep 01 , 2024 | 12:33 AM

గత రెండు రోజులుగా నందికొట్కూరు పట్టణంలో వర్షం కురుస్తూనే ఉంది.

కొత్తపల్లి: ఎద్దులేరు వాగును పరిశీలిస్తున్న డీఎస్పీ రామాంజి నాయక్‌

నందికొట్కూరు, ఆగస్టు 31: గత రెండు రోజులుగా నందికొట్కూరు పట్టణంలో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో మారుతి నగర్‌, హాజీ నగర్‌, తదితర లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లుతున్నాయి. మారుతి నగర్‌ ఎగువన పొలాల్లో కురిసిన వర్షానికి మారుతి నగర్‌, హాజీనగర్‌లోని డ్రైన్లు పొంగి రోడ్డుపై అడుగుపైగా వర్షపునీరు ప్రవహించింది. రోజంతా వర్షం కురుస్తుండడంతో డ్రైనేజీలు కూడా పొంగిపొర్లుతూనే ఉన్నాయి. మారుతి నగర్‌లో రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీటిని మున్సిపల్‌ కమిషనర్‌ సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులు పరిశీలించారు.

కొత్తపల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల్లో భాగంగా కొత్తపల్లి మండలంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. మండలంలో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కురిసిన వర్షానికి 50.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో శివపురం ఎద్దులేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మండలంలోని శివపురం, ముసలిమడుగు, ఎర్రమఠం, సింగరాజుపల్లి, గుమ్మడాపురం, పాతమాడుగుల తదితర గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే నందికుంట, కొత్తపల్లి, గువ్వలకుంట్ల, కొక్కెరంచ గ్రామాల్లో వీధుల్లో సైతం వాగులను తలపిస్తున్నాయి. పంట పొలాలు కూడా నీట మునిగి చెరువులను తలపిస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొత్తపల్లి మండలంలోని శివపురం ఎద్దులేరు వాగు భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఎవరూ కూడా ఆ వాగును దాటేందుకు ప్రయత్నించవద్దని ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్‌ హెచ్చరించారు. శని వారం సాయంత్రం ఆత్మకూరు సీఐ సురేష్‌ కుమార్‌ రెడ్డి, ఏఎస్‌ఐ బాబా ఫకృద్దీన్‌, శివపురం సర్పంచ్‌ చంద్రశేఖర్‌ యాదవ్‌తో కలిసి ఎద్దులేరు వాగును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందుకు వరద తగ్గుముఖం పట్టే వరకు ఎవరూ దాటవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం ఇరువైపులా వాగును దాటకుండా తాడును అడ్డంగా కట్టారు.

వెలుగోడు: వెలుగోడు మండలంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కుండపోతగా పడుతుండటంతో అధిక శాతం ఇంటికే పరిమిత మయ్యారు.

మహానంది: మహానంది మండలంలో శనివారం ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో మండలంలో రైతులు విస్తారంగా సాగు చేసే వరి పంట నీట మునిగింది. గతంలో ఎన్నడు లేని విధంగా వర్షాకాలం సీజన్‌లో గత రెండు రోజుల నుండి వర్షం కురియడంతో నల్లమల అడవిలోని వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. దీంతో మహానంది సమీపంలోని పాలేరువాగులో నీటి ఉధృతి మరింత పెరిగింది. నీటి ఉధృతి వాగుపై పెరిగితే మహానంది నుంచి గాజులపల్లి వైపు వాహనాలు వెళ్లే అవకాశం ఉండదు. సాయంత్రం మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి సిబ్బందితో వెళ్లి పాలేరువాగును పరిశీలించారు. వాహనదారులను అప్రమత్తం చేశారు. కాగా గుంటూరు- గుంతకల్లు రైల్వే మార్గంలో డబల్‌ లైన్‌ నిర్మాణంలో భాగంగా మండలంలోని గోపవరం వద్ద లో లెవెల్‌ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న బ్రిడ్జిని ఇరుకుగా అసంపూర్తిగా నిర్మించడంతో సమీపంలో రైతులు సాగు చేసే పంట పొలాల్లో నీట మునిగాయి. దీంతో ఆందోళన చెందిన రైతులు సెల్‌ఫోన్‌ ద్వారా గుంటూరు రైల్వే డీఆర్‌ఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన నంద్యాల రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తం అయిన ఇంజనీరింగ్‌ శాఖ కాంట్రాక్టర్‌ ద్వారా ఆగమేఘాల మీద ఇరుకుగా నిర్మించిన బ్రిడ్జిని కొంత భాగం ఎక్సవేటర్‌ సాయంతో తొలగించారు. దీంతో వర్షపు నీరు సులభంగా ప్రవహించింది. వెంటనే చొరవ చూపిప రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

పాములపాడు: రుద్రవరం గ్రామంలో రామ బ్రహ్మయ్య, మల్లికార్జున, శ్రీనవాసులకు చెందిన మట్టి మిద్దెలు కూలిపోయాయి. సమయానికి వారు ఇళ్ళలో లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లోని వస్తువులు మొత్తం మట్టిలో కూరుకుపోయాయి. కూలిపోయిన ఇళ్లను ఎమ్మెల్యే జయసూర్య పరిశీలించారు. అఽధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2024 | 12:33 AM

Advertising
Advertising