ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైద్యశాల తనిఖీ

ABN, Publish Date - Oct 12 , 2024 | 12:27 AM

సుండిపెంట గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు.

ఆసుపత్రిని తనిఖీ చేస్తున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

శ్రీశైలం, అక్టోబరు 11: సుండిపెంట గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా కలిసి వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులతో కలిసి సమీక్ష నిర్వహించారు. వైద్యశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఔషదాల కొరత, సిబ్బంది కొరత తదితర వాటిపై కూలంకుషంగా చర్చించి త్వరలోనే సమస్యల పరిష్కారదిశగా ముందుకెల్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా శ్రీశైలం మండలంలో అధిక సంఖ్యలో పేద ప్రజలు ఉన్నారని వారికి సకాలంలో వైద్యసేవలు అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. తరువాత స్థానిక జెన్‌కో గెస్ట్‌ హౌస్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్నాటు చేసి స్థానిక సమస్యలపై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యలన్నీంటినీ త్వరలోనే ఆయా అధికారులతో పరిష్కరించే దిశగా ప్రయత్నింస్తానని తెలిపారు. అలాగే సొంత ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటటాయించేలా చేస్తానన్నారు. రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 20 వరకు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొంటుందని, శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరు చేశారన్నారు. అంతేకాకుండా శ్రీశైలం మండలం సుండి పెంట గ్రామ అభివృద్ధికి సుమారు రూ.3 కోటు కేటాయించారని, దీంతో గ్రామంలో అంతర్గత రోడ్లు, మంచినీటి సదుపాయం, తదితర మౌళిక సదుపాయాలు మెరుగుపరుస్తామని అన్నారు.

Updated Date - Oct 12 , 2024 | 12:27 AM