ఇది ప్రజా ప్రభుత్వం
ABN, Publish Date - Sep 22 , 2024 | 12:01 AM
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతోం దని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
వెలుగోడు, సెప్టెంబరు 21: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతోం దని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. బోయరేవుల గ్రామంలో సర్పంచ్ పెద్ద సామన్న అధ్యక్షతన శనివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మేనిఫెస్టోలో తెలిపిన విధంగా పింఛన్ రూ.4 వేలకు పెంపు, మెగా డీఎస్సీ, గ్రామీణాభివృద్ధికి పంచాయతీకి నిధులు, అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5 భోజనం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని తెలిపారు. గత వైసీపీ పాలనలో వ్యవస్థలను సర్వనాశనం చేశారని మండి పడ్డారు. కమీషన్లకు కక్కుర్తిపడి కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని అన్నారు. శ్రీవారి సొమ్మును దోచేయడంతో పాటు కోట్లాది హిందువుల మనోభావాలు వైసీపీ నాయకులు దెబ్బతీశారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అమానుల్లా, టీడీపీ నాయకులు శేషిరెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, రాజశేఖర్, సుంకిరెడ్డి, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నందికొట్కూరు: పట్టణంలోని 4వ వార్డులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ బేబీ నిర్వహించారు. పలు రకాల పథకాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు.
ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు, టీడీపీ పట్టణాధ్యక్షుడు వేణుగోపాల్, సీనియర్ నాయకులు గోవిందరెడ్డి, కలీముల్లా, బాషా, రామకృష్ణ, రామసుబ్బయ్య, రామ్మూర్తి, బీజేపీ నాయకులు సుదర్శన్, సాంబశివ, జనసేన నాయకుడు అరుణ్ పాల్గొన్నారు.
మిడుతూరు: అలగనూరు రిజర్వాయర్ నుంచి సొంత జిల్లా అయిన కడప జిల్లాకు నీళ్లు తీసుకుపోలేని అసమర్థుడు మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య విమర్శిచారు. తలముడిపి గ్రామంలో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభ్వుతం’ కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కుంగిన అలగనూరు రిజర్వాయర్ కట్టను అప్పటి వైసీపీ ప్రభుత్వం రూ.3 కోట్లతో ఖర్చు చేస్తే పని పూర్తయ్యే పనిని ప్రస్తుతం రూ.34 కోట్ల ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాల గురించి ప్రజలకు వివిరించారు. తలముడిపి గ్రామంలో కుందూ నది బ్రిడ్జి, నందికొట్కూరు నుంచి గడివేముల వరకు రెండు లైన్ల రొడ్డు నిర్మిస్తామని ఆయన తెలిపారు. అనంతరం గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కరపత్రాలను ఇంటి ఇంటికి తిరిగి అందజేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, నాయకులు శివరామిరెడ్డి, రామస్వామి రెడ్డి, మనోహర్‌రెడ్డి, రవీంద్ర బాబు, నరసింహగౌడు, సర్వోత్తమ రెడ్డి, ఇద్రూస్, బీజేపీ నాయకుడు దామోదర్ రెడ్డి, జనసేన నాయకులు రవికుమార్, సంపత్, అధికారులు పాల్గొన్నారు.
పాములపాడు: వేంపెంట గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, ఆదిరెడ్డి, బాలస్వామి, మాణిక్యమ్మ, మోహన్‌గౌడ్, రమణారెడ్డి, రమేశ్, రాజేశ్, అంజిరెడ్డి, వెంకటేశ్‌రెడ్డి, రామ్మోహనరెడ్డి, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
బండిఆత్మకూరు: ఎ.కోడూరు, బండిఆత్మకూరు, శింగవరం గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కరపత్రాలు, స్టిక్కర్లు ఇంటింటికి అందజేశారు. కార్యక్రమాల్లో ఏపీఎం రాజశేఖర్‌రెడ్డి, టీడీపీ నాయకుడు మధుసూదన్‌రెడ్డి, ఈవోపీఆర్డీ నటరాజ్, శ్రీనివాసరెడ్డి, జాకీర్, మధురెడ్డి, శివ కుమార్, మోహన్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, జయరామిరెడ్డి, సర్పంచ్ సంధ్య, కొత్తూరయ్య, నందయ్య పాల్గొన్నారు.
మహానంది: బుక్కాపురం, అబ్బీపురం గ్రామాల్లో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు బోచర్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు ఉల్లి మధు, యూనిట్ ఇన్‌చార్జిలు జనార్దన్‌రెడ్డి, ఎంఈవో రామసుబ్బయ్య, పంచాయతీ కార్యదర్శి సుమంత్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, నాయకులు శివ, నాగపుల్లయ్య, సుబ్రమణ్యం, నాగరాజు, జయరాం, మాజీ ఎంపీటీసీ దస్తగిరి, హరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Sep 22 , 2024 | 12:01 AM