కాణిపాకం వినాయక స్వామికి మహానందీశ్వరుడి పట్టు వస్త్రాలు
ABN, Publish Date - Sep 20 , 2024 | 12:32 AM
వినాయక చవితి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి మహానంది దేవస్ధానం తరపున పట్టు వస్త్రాలను గురువారం సమర్పించారు.
మహానంది, సెప్టెంబరు 19: వినాయక చవితి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి మహానంది దేవస్ధానం తరపున పట్టు వస్త్రాలను గురువారం సమర్పించారు. మహానంది ఆలయం తరుపున ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఏఈవో ఎర్రమల్ల మధు, వేద పండితులు, అర్చకులు వినాయకుని పట్టువస్త్రాలకు మహానంది ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో కాణిపాకం వెళ్లారు. సాయంత్రం కాణిపాకం ఆలయం వద్ద వీరికి ఆలయ ఈవో పి. గురు ప్రసాద్, వేదపండితులు, అర్చకులు, సిబ్బంది కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలను ఈవో సమక్షంలో అక్కడి వేదపండితులకు అందజేసారు.
Updated Date - Sep 20 , 2024 | 12:32 AM