ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తిశ్రద్ధలతో కార్తీక దీపారాధనలు

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:43 AM

శ్రీశైలం శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

ఆకాశ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు, పాల్గొన్న ఇన్‌చార్జి ఈవో

శ్రీశైలం, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తు న్నారు. ఆలయ ముందుభాగంలో దీపారాధనలు నిర్వహిం చుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించు కున్నారు. ఆలయ ఉత్తర మాఢవీధి ప్రాంగణం వద్ద, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద విశేష పూజలు నిర్వహించుకుని దీపారాధనలను జరిపారు. అలాగే పలువురు భక్తులు లక్ష వొత్తుల నోములు నిర్వహించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, బిస్కెట్లు, అల్పాహారం అందజేశారు. సాయంత్రం ఆలయ ధ్వజస్తంభం వద్ద శాస్త్రోక్తంగా ఆకాశ దీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆకాశదీప ప్రజ్వలనకు ముందుగా అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్య క్రమం నిర్విఘ్నంగా జరిగాలని గణపతి పూజను నిర్వహించి, దీపప్రజ్వలన, దీపారాధనలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించనున్నారు.

స్వామి, అమ్మవార్లకు ఊయల సేవ

శ్రీశైలం మహాక్షేత్రంలో లోక కల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవను ఘనంగా నిర్వహించారు. ముందుగా మహా గణపతి స్వామికి పూజలు జరిపించారు. గ్రామదేవత అంకాలమ్మకు విశేష పూజలు నిర్వహించారు. ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో శుక్రవారం సాయంత్రం విజయవాడకు చెందిన పంచమ వేదనృత్యాలయం బృందంతో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తరువాత కార్యక్రమంలో కర్నూలుకు చెందిన డి.లక్ష్మీమహేష్‌ భాగవతార్‌ బృందంతో శివపార్వతీ కల్యాణంపై హరికథగానం చేయగా, కీబోర్డు సహకారాన్ని బి. ఆంజనేయులు, మృదంగ సహకారాన్ని బి. ప్రసాద్‌ అందించారు.

Updated Date - Nov 09 , 2024 | 12:45 AM