ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహానందిలో సామూహిక అభిషేకం

ABN, Publish Date - Nov 04 , 2024 | 12:04 AM

మహానందిలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల సందడి కొనసాగుతోంది.

సామూహిక అభిషేకంలో పాల్గొన్న భక్తులు

మహానంది, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మహానందిలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల సందడి కొనసాగుతోంది. ఆదివారం సెలవురోజు కావడంతో పలు ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ మేరకు భక్తులు ఆలయానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ కామేశ్వరీదేవి, మహానందీశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్థానిక అలంకార మండపంలో సామూహిక రుద్రాభిషేకంలో భక్తులు పాల్గొన్నారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, పండితులు భక్తులతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీకమాసం మొదటి సోమవారం భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయి.కార్తీకమాసం సందర్భంగా మహానంది ఆలయ గోపురాలు విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి.

Updated Date - Nov 04 , 2024 | 12:04 AM