ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన

ABN, Publish Date - Sep 22 , 2024 | 08:50 AM

అమరావతి: జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని హంద్రీ నీవా ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. అలాగే మాల్యాల పంప్ హౌస్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం కర్నూలు నుంచి అనంతపురం జిల్లాలో పర్యటనకు వెళతారు.

అమరావతి: జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆదివారం కర్నూలు (Kurnool), అనంతపురం (Anantapuram) జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని హంద్రీ నీవా ప్రాజెక్ట్ (Handri Neeva Project) పనులను పరిశీలించనున్నారు. అలాగే మాల్యాల పంప్ హౌస్‌ (Mallya Pump House)ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం కర్నూలు నుంచి అనంతపురం జిల్లాలో పర్యటనకు వెళతారు. జీడిపల్లి రిజర్వాయర్‌ (Jedipalli Reservoir)ను పరిశీలిస్తారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో హంద్రీ నీవా ప్రాజెక్ట్ పనులపై మంత్రి సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం చెర్లోపల్లి రిజర్వాయర్‌ను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలిస్తారు.


కాలువ ద్వారా వేలాది ఎకరాలు సాగులోకి తేవాలనే హంద్రీ నీవా విభాగం ఏర్పాటు చేశారు. ఈ విభాగం కింద కృష్ణా నది జలాలను కాలువ ద్వారా తరలించి పందికొన జలాశయానికి చేరుస్తారు. అక్కడి నుంచి పిల్ల కాలువల ద్వారా పొలాలకు సాగునీరివ్వాలి. అయితే నిర్వహణ కొరవడడం, గత వైసీసీ ప్రభుత్వ నిర్ల్యక్షం రైతులకు శాపంగా మారింది. మండలంలోని 50,626 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది హంద్రీ నీవా లక్ష్యం అయితే 20 వేల ఎకరాల్లోపు పొలాలకు మాత్రమే నీరందుతోంది.


నీరున్నా అందదు..

ప్రధాన కాలువ నుంచి పిల్ల కాలువల ద్వారా పొలాలకు నీరందాలి. అయితే పిల్ల కాలువలు డిస్ట్రిబ్యూటరీలు లేవు. కొన్నిచోట్ల ఉన్నా నిర్వహణ లేదు. దేవనకొండ, పల్లెదొడ్డి, గద్దెరాళ్ల, కుంకునూరు, జిల్లేడ బుడకల, కప్పట్రాళ్ల తదితర గ్రామాలకు నీరు వస్తున్నా పిల్ల కాల్వలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పిల్లకాల్వల ఏర్పాటు, నిర్వహణకు నిధులు లేకపోవడంతో అవి కాస్తా శిథిలావస్థకు చేరాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు.

మోటార్లతో ఎత్తిపోసుకుంటే..

ప్రధాన కాలువలో నీరు పుష్కలంగా ఉన్నా, అక్కడి నుంచి మోటర్లతో నీరు ఎత్తిపోసుకోవాలంటే రోజుకు మోటర్‌ బాడుగ, డీజిల్‌, కూలీ మొత్తం రూ.10వేల వరకు వస్తుంది. దీతో ఇది తలకు మించిన భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ నిర్లక్ష్యమే కారణం

కాలువ నిర్వహణ, పిల్ల కాలు వల ఏర్పాటును గత వైసీపీ ప్రభు త్వం పూర్తి స్థాయిలో విస్మరిం చింది. 2014లో నాటి టీడీపీ ప్రభుత్వం చేసిన పనులే ఇప్పటికీ ఉన్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాలువ వైపు కన్నెత్తి చూడలేదు.


కాగా కాలువల చివరి ఎకరానికీ సాగునీరందేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, జల వనరుల శాఖ ఇంజనీర్లను జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. శనివారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావుతో కలసి జిల్లాల కలెక్టర్లు, జల వనరుల శాఖ ఇంజనీర్లతో మంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. అకాల వర్షాలు, వరదలతో దెబ్బతిన్న కాలువలు, చెరువులకు పడిన గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను కోరారు. జలవనరుల శాఖ ఇంజనీర్లతో కలసి కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని సూచించారు. ఉభయగోదావరి జిల్లాలు, కోనసీమ, గుంటూరు, ఎన్‌టీఆర్‌, బాపట్ల జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏలేరు, ఎర్రకాలువ, బుడమేరు, కొల్లేరు గండ్ల పూడిక పనులతోపాటు ఆక్రమణలను కూడా గుర్తించాలన్నారు. కృష్ణా డెల్టాలో ఏలూరు, బందరు కాలువలు, బుడమేరు, గూడూరు చానల్‌ గండ్లు పూడ్చడంతోపాటు బకింగ్‌హామ్‌ కెనాల్‌ శివారు వరకూ నీరందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, మంత్రి నిమ్మల ఆదివారం నుంచి హంద్రీ నీవాసహా .. రాయలసీమ ప్రాజెక్టుల పర్యటన చేయనున్నారు. ప్రాజెక్టుల పరిస్థితిని రామానాయుడు పర్యవేక్షిస్తారు.

Updated Date - Sep 22 , 2024 | 08:50 AM