ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అధికారులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే

ABN, Publish Date - Sep 03 , 2024 | 12:40 AM

రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరిత

గడివేముల, సెప్టెంబరు 2: రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత సూచించారు. వర్షాలపై గడివేముల మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం మండల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల సంభవించిన నష్టాలపై ఆరా తీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉండటంతో పశు, పంట నష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో సీజన్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సురక్షిత మంచి నీటిలో మురుగు నీరు కలవకుండా లీకేజీలను అరికట్టాలని అన్నారు. రైతులు విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి 6 ఇళ్లు పాక్షికంగా, ఒక ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. దెబ్బతిన్న ఇళ్లకు పక్కా ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు పంట నమోదు చేసుకోవాలని సూచించారు. ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం బిలకలగూడురు గ్రామంలో కొళాయిలకు నీళ్లు రావడం లేదని, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆ గ్రామ టీడీపీ నాయకులు ఎస్‌ఏ రఫిక్‌, సుదర్శన్‌రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. బిలకలగూడురు గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ బీవీఎన్‌ విద్యాసాగర్‌, మండల వ్యవసాయాధికారి హేమసుందర్‌ రెడ్డి, మండల అధికారులు, టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, పంట రామచంద్రారెడ్డి, కృష్ణయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 12:40 AM

Advertising
Advertising