ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముందుగానే పింఛన్ల పండుగ

ABN, Publish Date - Dec 31 , 2024 | 11:55 PM

పింఛన్‌దారులకు కొత్త సంవత్సరం పండుగ ముందుగానే వచ్చిందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో పింఛన్‌ పంపిణీ చేస్తున్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల రూరల్‌, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): పింఛన్‌దారులకు కొత్త సంవత్సరం పండుగ ముందుగానే వచ్చిందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. పులిమద్ది గ్రామంలో మంగళవారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కన్వీనర్‌ విశ్వనాఽథరెడ్డి, ఎస్సార్బీసీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ నయూబ్‌ మహమ్మద్‌ ఫయాజ్‌, అమర్నాథరెడ్డి, పురుషోత్తంరెడ్డి, ఛంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నందికొట్కూరు(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పింఛన్‌ దారుల్లో నూతన సంవత్సరం ఒక్క రోజు ముందుగానే వెలుగులను తీసుకొచ్చిందని నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి అన్నారు. నందికొట్కూరు పట్టణంలోని 24వ వార్డులో మంగళవారం పింఛన్‌ పంపిణీ చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ దాసి సుధాకర్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్‌ చాంద్‌బాషా, టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, కట్టుబడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

పగిడ్యాల(ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పాటుపడుతోందని నంద్యాల ఎంపీ డాక్టరు బైరెడ్డి శబరి అన్నారు. నెహ్రూనగర్‌ గ్రామంలో సర్పంచ్‌ రాజేశ్వరి ఆధ్వర్యంలో ఎంపీ మంగళవారం పింఛన్‌ పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ముచ్చుమర్రిలో పింఛన్‌ అందజేశారు. ఎంపీడీవో సుమిత్రమ్మ, నాయకులు పాల్గొన్నారు.

నందికొట్కూరు రూరల్‌(ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ఒక్కరోజు ముందుగానే ఫించన్‌ పంపిణీ చేసిందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. బిజినవేముల, కొణిదేల నాగటూరు గ్రామాలలో మంగళవారం పింఛన్‌ పంపిణీ చేశారు. ఎంపీడీవో సుబ్రహ్మణ్యశర్మ, మండల ప్రత్యేక అధికారి డీఆర్‌డీఏ పీడీ శ్రీధరెడ్డి, బిజినవేముల సర్పంచ్‌ రవియాదవ్‌, నాగటూరు టీడీపీ నాయకులు మల్లికార్జునరెడ్డి, గ్రామ కార్యదర్శులు చెన్నయ్య, జావేద్‌, శరత్‌ కుమార్‌, వీఆర్వో సురేష్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కొత్తపల్లి(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఏపీ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ అన్నారు. మంగళవారం ముసలిమడుగు గ్రామంలో పింఛన్‌ పంపిణీ చేశారు. మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ చైర్మన్‌ అయిన తర్వాత తన స్వగ్రామమైన ముసలిమడుగుకు తొలిసారిగా రావడంతో గ్రామస్థులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. నాయకులు షఫీవుల్లా, రహీంఖాన్‌, గోపాల్‌ రెడ్డి, ఖుద్రుస్‌ బాషా, యూనుస్‌ బాషా, నూరుల్లా ఉన్నారు.

ఆత్మకూరు(ఆంధ్రజ్యోతి): పింఛన్ల పంపిణీతో పేదల కళ్లలో వెలుగులు వచ్చాయని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. నల్లకాల్వ గ్రామంలో మంగళ వారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్ర మంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, అర్బన్‌ సీఐ రాము, టీడీపీ మండల అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, సర్పంచ్‌ వెంకటరమణ, నాయకులు రమేష్‌ తదితరులు ఉన్నారు.

బండిఆత్మకూరు(ఆంధ్రజ్యోతి): రబీ సీజన్‌ పంటలకు కేసీ కెనాల్‌, తెలుగుగంగ కింద సాగునీరు విడతల వారీగా అందజేస్తామని కర్నూలు, కడప కాలువ కమిటీ చైర్మన్‌ బన్నూరు రామలింగారెడ్డి అన్నారు. మండలంలోని సంతజూటూరులో మంగళవారం పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. అనంతరం సీసీ రోడ్డు పనులు సర్పంచ్‌ యలగల రామచంద్రుడుతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో టీజీపీ స్థానిక చైర్మన్‌ నాగశేషారెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకట చౌడయ్య, రామకృష్ణ, శివరామిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 11:55 PM