ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టాలి’

ABN, Publish Date - Nov 10 , 2024 | 12:20 AM

అలగనూరు రిజర్వాయర్‌ మరమ్మతులకు తక్షణమే ప్రభు త్వం నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా నాయకులు రంగ నాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న సీపీఐ నాయకుడు

గడివేముల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): అలగనూరు రిజర్వాయర్‌ మరమ్మతులకు తక్షణమే ప్రభు త్వం నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా నాయకులు రంగ నాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న డిమాండ్‌ చేశారు. మండలంలోని కొరపోలూరు గ్రామంలో ఆదివారం రైతుల వద్ద సంతకాలు సేకరించారు. వారు మాట్లాడుతూ అలగనూరు రిజర్వాయర్‌ కరకట్ట తెగి 4 సంవత్సరాలు అవుతోందని, గత ప్రభుత్వం కరకట్ట మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం వహించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే కలెక్టర్‌ కుంగిన కరకట్టను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అంద జేశారని అన్నారు. సీపీఐ నాయకులు రైతుల వద్దకు వెళ్లి సంతకాలు సేకరించి ముఖ్య మంత్రికి వినతి పత్రం అందజే స్తామని చెప్పారు. రైతు సంఘం నాయ కులు అబ్రహం, మాబాషా, రసూల్‌, ఇబ్రహీం, తిరుపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 12:20 AM