ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు: ఆర్డీవో

ABN, Publish Date - Dec 21 , 2024 | 12:20 AM

రైతులు ఎదుర్కొం టున్న భూసమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో విశ్వనాథ్‌ అన్నారు.

మంచాలకట్టలో రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఆర్డీవో

గడివేముల, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రైతులు ఎదుర్కొం టున్న భూసమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో విశ్వనాథ్‌ అన్నారు. మండలంలోని మంచాలకట్ట గ్రామంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు. రైతుల నుంచి అర్జిలు స్వీకరించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్‌ వెంకటరమణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

జూపాడుబంగ్లా(ఆంధ్రజ్యోతి): రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని తహసీల్దార్‌ చంద్రశేఖర్‌నాయక్‌ అన్నారు. తూడిచర్ల గ్రామంలో సర్పంచ్‌ బాలమద్దిలేటి అఽధ్యక్షతన రెవెన్యూ గ్రామసభ నిర్వహించారు. డీటీలు సత్యదీప్‌, నాగన్న, వీఆర్వో, సర్వేయర్లు పాల్గొన్నారు.

ఆత్మకూరు రూరల్‌(ఆంధ్రజ్యోతి): పిన్నాపురం గ్రామంలో తహసీ ల్దార్‌ రత్నరాధిక ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ ఆంజనేయులు, ల్యాండ్‌ సర్వే అధికారి రాజశేఖర్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 12:20 AM