ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాల ఆకస్మిక తనిఖీ

ABN, Publish Date - Aug 28 , 2024 | 12:47 AM

పాములపాడులోని ఏఎన్‌ఆర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకరరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాములపాడులో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డీఈవో

పాములపాడు, ఆగస్టు 27: పాములపాడులోని ఏఎన్‌ఆర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకరరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్‌ఎం గోపాల్‌, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేయాలని, ఉపాధ్యాయుల కొరతపై ఆరాతీశారు. నాడు-నేడు పనులు, చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. జిల్లాలో 2,500 మంది విద్యా వలంటీర్లను సెప్టెంబరులో తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

ఆత్మకూరు: మండలంలోని కొట్టాలచెరువు గ్రామంలో ప్రధానమంత్రి ఆదివాసి న్యాయమహా అభియాన్‌ కార్యక్రమంలో నూతనంగా నిర్మించనున్న ఆదివాసి బాలుర వసతి గృహానికి సంబంధించిన స్థలాన్ని సోమవారం డీఈవో సుధాకరరెడ్డి, శ్రీశైలం ఐటీడీఏ ఇంచార్జ్‌ పీవో సురేష్‌కుమార్‌ పరిశీలించారు. వారు మాట్లాడుతూ కేంద్రం రూ.2.30కోట్లతో మంజూరు చేసిన ఆదివాసి బాలుర వసతి గృహా నిర్మాణానికి సెప్టెంబరు మొదటి వారంలో కొట్టాలచెరువులో భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. అదేరోజు సభను నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వారు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. వీరి వెంట తహసీల్దార్‌ రత్నరాధిక, ఎంఈవో బాలాజీనాయక్‌, డిప్యూటీ తహసీల్దార్‌ హరికృష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 12:48 AM

Advertising
Advertising
<