ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్రీడా పోటీలు ప్రారంభం

ABN, Publish Date - Sep 20 , 2024 | 12:41 AM

పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్‌ గేమ్స్‌ ఆఫ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో గురువారం ఎంపిక పోటీలను ప్రారంభించారు.

మిడుతూరులో కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు

ఆత్మకూరు, సెప్టెంబరు 19: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్‌ గేమ్స్‌ ఆఫ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో గురువారం ఎంపిక పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో మెలగాలని ఆత్మకూరు ఎంఈవో సురేష్‌ సూచించారు. ఆయన మాట్లాడుతూ అండర్‌-14, అండర్‌-17 విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, యోగా, చెస్‌, అథ్లెటిక్స్‌ క్రీడలకు సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను నియోజకవర్గ క్రీడలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నాగరాజు. ఎస్‌ఎంసీ చైర్మన్‌ శివకుమార్‌, వైస్‌చైర్మన్‌ చంద్రలీల, క్రీడల కోఆర్డినేటర్‌ శంకర్‌ ఉన్నారు.

జూపాడుబంగ్లా: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మండల కోర్డినేటర్‌ శ్రీనివాసులు, ఎంపీపీ సువర్ణమ్మ, ఎంపీడీవో నూర్జహాన్‌ అన్నారు. జూపాడుబంగ్లాలోని అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల క్రీడప్రాంగణంలో మండలస్థాయి స్కూల్‌గేమ్స్‌ ప్రారంభించారు. అండర్‌-14, అండర్‌-17 విభాగం బాలురకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, చెస్‌, యోగా తదితర క్రీడలు నిర్వహించారు. ప్రిన్సిపాళ్లు మూర్తి, రమేష్‌, యశోద, పీఆర్‌ఏఈ బషీర్‌, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మిడుతూరు: స్థానిక జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో మండల స్థాయి క్రీడా పోటీలు గురువారం ఉత్సహంగా ప్రారంభమయ్యాయి. ఎంపీడీవో జీఎన్‌ఎస్‌ రెడ్డి, ఎంఈవో ఫయిజున్‌ బేగం, ఎంఈవో-2 శ్రీనాథ్‌, టీడీపీ నాయకులు తువ్వా భగీరథ రెడ్డి, శివరామి రెడ్డి, సర్వోత్తమ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, ఇద్రూస్‌, హెచ్‌ఎం సాయి తిమ్మయ్య, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి వెంటేశ్వర్లు, వివిధ పాఠశాలల పీఈటీలు పాల్గొన్నారు.

పగిడ్యాల: గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసీ జాతీయస్థాయి పోటీలలో పాల్గోనేలా క్రీడాకారులను తయారు చేయాలని ఎంఈవో సుబాన్‌ తెలిపారు. పగిడ్యాల జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో నిర్వహించిన మండల స్థాయి పోటీలను గురువారం ఆయన ప్రారంబించారు. కార్యక్రమంలో ఎంఈవో-2 మురళీమోహన్‌రెడ్డి, హెచ్‌ఎం మదుసూదన్‌, వ్యాయమ ఉపాధ్యాయులు, పీతాంబర్‌రెడ్డి ఉన్నారు.

నేటి నుంచి గడివేములలో..

గడివేముల: గడివేములలోని జడ్పీ హైస్కూల్‌లో ఎస్‌జీఎఫ్‌ఐ మండల స్థాయి క్రీడా పోటీలను ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు హెచ్‌ఎం విక్టర్‌ ఇమ్మానుయేలు తెలిపారు. 20న బాలురకు, 21న బాలికలకు ఆటల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 12:41 AM