ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srisaila Devasthanam: వైసీపీ హయాంలో అంతా మాయ..

ABN, Publish Date - Sep 21 , 2024 | 02:20 PM

ఆలయాల్లో భక్తుల సమస్యలు పట్టించుకోవడం పక్కనపెట్టి.. సొంత జేబులను నింపుకోవడానికే వైసీపీ నేతలు, ఆ పార్టీకి వంతపాడుతున్న అధికారులు ఐదేళ్లు పనిచేసినట్లు తెలుస్తోంది. తిరుపతి లడ్డూ వివాదం బయటకు రావడంతో.. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి..

Srisaila Devasthanam

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆలయాలను ఆదాయ వనరుగా మార్చుకుందా.. నాయకుల జేబులను నింపుకోవడానికి ప్రసాదాల తయారీలో మోసాలకు పాల్పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భక్తుల విశ్వాసాలను పణంగా పెట్టి రాజకీయాలను చేసింది. తిరుపతి లడ్డూ వివాదంతో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోని ప్రసాదాల తయారీలో అవకతవకలు బయటకు వస్తున్నాయి. అధికారం ఉందనే అహంకారంతో వైసీపీ నేతలు సాగించిన అరాచకాలు బయటపడుతున్నాయి. వైసీపీ నేతలు చెప్పడంతో ప్రసాదాల తయారీకి సరఫరా చేసే సరుకుల్లో తేడాలున్నా అధికారులు సైలెంట్ అయిపోయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయాల్లో భక్తుల సమస్యలు పట్టించుకోవడం పక్కనపెట్టి.. సొంత జేబులను నింపుకోవడానికే వైసీపీ నేతలు, ఆ పార్టీకి వంతపాడుతున్న అధికారులు ఐదేళ్లు పనిచేసినట్లు తెలుస్తోంది. తిరుపతి లడ్డూ వివాదం బయటకు రావడంతో.. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో అవకతవకలపై నోరు విప్పుతున్నారు. గత ఐదేళ్లలో ఎప్పుడైనా ఈ విషయాన్ని బయటకు చెబుదామని ప్రయత్నించినా బెదిరించేవారని, దీంతో నోరు మెదపని పరిస్థితి నెలకొందని కొందరు వాపోతున్నారు. ఆలయాల్లో వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలను పెంచి పోషించిందనే విషయం స్పష్టమవుతోంది. తాజాగా శ్రీశైలంలోని మల్లన్న క్షేత్రంలో ప్రసాదంలో ఉపయోగించిన వస్తువుల్లో మోసాలు, నాణ్యతా లోపాలపై దర్యాప్తు చేయాలని భక్తులు కోరుతున్నారు.

విద్యాసాగర్‌ అరెస్టు


ప్రసాదంలో కమీషన్లు..!

భక్తులు దేవుడి ప్రసాదాన్ని ఎంతో అపురూపంగా భావిస్తారు. ఆలయానికి వెళ్తే అక్కడ లభించే ప్రసాదాన్ని తీసుకోకుండా రారు. అటువంటి ప్రసాదంలోనే కల్తీకి పాల్పడ్డ ఘటనలు బయటకు వస్తున్నాయి. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలోని ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు నాణ్యతపై భక్తుల నుంచి ఎన్నో ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ చర్యలు శూన్యం. వైసీపీ నేతలకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన డిప్యూటీ కలెక్టర్‌ ఎస్‌.లవన్ననుమ వైసీపీమ ప్రభుత్వం 2021లో శ్రీశైల దేవస్థానం ఈవోగా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన కొన్నాళ్లకు లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి, జీడిపప్పు వంటి పదార్థాల కొనుగోలు నాణ్యతపై వివాదాలు రేగాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రసాదం తయారీలో నాణ్యతలేని వస్తువులు సరఫరా చేసిన ఘటనపై దర్యాప్తు చేయాలని భక్తులు కోరుతున్నారు.

ఎన్నికల్లో, పాదయాత్రలో ఇచ్చిన.. ప్రతి హామీ అమలు చేస్తాం


అంతా వాళ్ల ఇష్టం..

అప్పటి ఈవో లవన్న ఆమోదించిన ప్రైవేటు సంస్థ దిగుమతి చేసిన నెయ్యి సరఫరాలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి. క్యాన్లపై బ్యాచ్‌ నంబరు, వరుస సంఖ్యతో కూడిన స్టిక్కర్‌ను జత చేస్తారు. చాలా క్యాన్లను బ్యాచ్‌ నంబర్లు లేకుండా సరఫరా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పెద్దల ఆశీస్సులతో వచ్చిన ఈవో అండదండలు నెయ్యి సరఫరా సంస్థకు ఉండటంతో ఆలయ అధికారులు ఎవరూ ప్రశ్నించే సాహసం చేయనట్లు తెలుస్తోంది. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో రోజూ పదివేలకు పైగా లడ్డూలను తయారుచేస్తారు. ఈ తయారీకి ఎక్కువ మోతాదులోనే నెయ్యి, జీడిపప్పు ఉపయోగిస్తారు. దీనిని ఆసరగా చేసుకుని కొందరు వైసీపీ నేతలు మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసాదాల తయారీలో ఉపయోగించే వస్తువుల నమూనాలు ప్రదర్శించాల్సి ఉన్నా కాంట్రాక్టర్ ఆ నిబంధనలు పాటించనట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

సంప్రోక్షణ చేయండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News Click Here

Updated Date - Sep 21 , 2024 | 02:42 PM