ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టు అందాలు... ఈ దృశ్యాల్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు

ABN, Publish Date - Jul 29 , 2024 | 05:33 PM

ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంటుండటంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి ప్రాజెక్టు నుంచి నీటికి కిందికి వదిలారు.

నంద్యాల: ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంటుండటంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి ప్రాజెక్టు నుంచి నీటికి కిందికి వదిలారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తిన అధికారులు, ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 879.90 అడుగులుగా ఉంది.


పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 182.6050 టీఎంసీలుగా నీటి నిల్వ ఉంది. కర్నూలు చీఫ్ ఇంజినీర్ కబీర్ బాషా 6, 7, 8 గేట్లను ఎత్తి మొత్తంగా 81 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. ప్రాజెక్టుకు 4,67,210 లక్షల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. నీటిని కిందకి వదులుతుండటంతో కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఇప్పటికే 62 వేల 725 క్యూసెక్కుల నీటిని వాడుతూ.. దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 879.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ అందాల్ని చూడటానికి పర్యాటకులు పోటెత్తారు.

Updated Date - Jul 29 , 2024 | 05:33 PM

Advertising
Advertising