ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

త్వరలో పాణ్యం సీహెచ్‌సీలో ఎక్స్‌రే సౌకర్యం

ABN, Publish Date - Nov 16 , 2024 | 12:50 AM

పాణ్యం సామాజిక ఆరోగ్య కేంద్రంలో త్వరలో ఎక్స్‌రే సేవలందిస్తామని హాస్పిటల్స్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ జఫ్రుల్లా తెలిపారు.

వైద్య సేవలను పరిశీలిస్తున్న డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జఫ్రుల్లా

పాణ్యం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): పాణ్యం సామాజిక ఆరోగ్య కేంద్రంలో త్వరలో ఎక్స్‌రే సేవలందిస్తామని హాస్పిటల్స్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ జఫ్రుల్లా తెలిపారు. శుక్రవారం ఆయన ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం కేంద్రంలోని రోగులను పరీక్షించి ఆరోగ్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌, ఎంసీహెచ్‌ సేవల గురించి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్‌ రహేలను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్‌ వైద్య సేవలు, మందుల పంపిణీ, ల్యాబ్‌, స్టెమీ, ఏబీడీఎం, జనరల్‌ సర్జన్లు, ఖాళీ పోస్టులు, డెలివరీలు, చిన్నపిల్లల వైద్యం అడిగి తెలుసుకున్నారు. మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. 49 ల్యాబ్‌ పరీక్షలపై ల్యాబ్‌ టెక్నీషియన్‌ను అడిగి తెలుసుకున్నారు. కాన్పుల సంఖ్య పెంచాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 12:50 AM