టీడీపీలో చేరిక

ABN, Publish Date - Aug 30 , 2024 | 12:47 AM

నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, ఎంపీటీసీ లు టీడీపీలో చేరారు.

 టీడీపీలో చేరిక
మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

నందికొట్కూరు రూరల్‌, ఆగస్టు 29: నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, ఎంపీటీసీ లు టీడీపీలో చేరారు. వీరు అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గిరీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. చేరిన వారు తరిగోపుల ఎంపీటీసీ సుజాత, వైసీపీ నాయకులు శ్రీను, సుధాకర్‌, కొలమయ్య, కృష్ణుడు, మస్తాన్‌ టీడీపీలో చేరారు. వీరికి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 12:47 AM

Advertising
Advertising