జంతువుల కొవ్వు వినియోగం హేయం: బీజేపీ
ABN, Publish Date - Sep 20 , 2024 | 04:16 AM
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడటం హేయమని బీజేపీ ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మండిపడ్డారు.
జంతువుల కొవ్వు వినియోగం హేయం: లంకా దినకర్
గుంటూరు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడటం హేయమని బీజేపీ ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మండిపడ్డారు. ఈ చర్య హిందువుల మనోభావాలను కించపరచడరమే అన్నారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ హయాంలో టీటీడీలో ప్రారంభమైన దోపిడీ జగన్ పాలనతో తారస్థాయికి చేరుకుందని ఆరోపించారు.
Updated Date - Sep 20 , 2024 | 04:16 AM