Mahasena Rajesh: పోటీ నుంచి తప్పుకున్న మహాసేన రాజేష్.. తెరవెనుక ఏం జరిగింది..!?
ABN, Publish Date - Mar 03 , 2024 | 03:17 AM
పీ గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని సరిపెల్ల రాజేశ్ (మహాసేన రాజేశ్) ప్రకటించారు..
టీడీపీ, జనసేనకు..
నష్టం జరగకూడదనే నిర్ణయం
పార్టీ తీసుకునే నిర్ణయానికి
కట్టుబడి ఉంటా: మహాసేన రాజేశ్
పోటీ నుంచి తప్పుకొంటున్నా: మహాసేన రాజేశ్
అమలాపురం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ‘పీ గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ, జనసేన (TDP-Janasena) ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని సరిపెల్ల రాజేశ్ (మహాసేన రాజేశ్) Mahasena Rajesh ప్రకటించారు. శనివారం సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియోని పోస్ట్ చేశారు. దానిలో... ‘నా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏడేళ్ల క్రితం నేను విడుదల చేసిన ఒక వీడియోను సాకుగా చూపి బ్రాహ్మణులు విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. ఈ పరిణామాలు ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు నష్టం కలిగించేలా ఉన్న దృష్ట్యా పోటీ నుంచి నిష్క్రమించడానికి నిర్ణయించుకున్నా. నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా జగన్ చేస్తున్న కుట్రల్లో భాగమే ఈ పరిణామాలు. హిందూ వ్యతిరేకిగా నాపై ముద్ర వేస్తూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంతో పార్టీకి నష్టం జరగకూడదని భావిస్తున్నా. కుల రక్కసి చేతిలో నేను బలయ్యా. ఈ వ్యవహారంపై టీడీపీ, జనసేన తీసుకునే నిర్ణయం ఏదైనా నేను స్వాగతిస్తా’ అని రాజేశ్ తెలిపారు.
Updated Date - Mar 03 , 2024 | 09:01 AM