Palnadu: మాచర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ
ABN, Publish Date - Aug 23 , 2024 | 07:29 PM
పల్నాడు జిల్లాలోని మాచర్ల మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 16 మంది వైసీపీ కౌన్సిలర్లు శుక్రవారం టీడీపీలో చేరారు. మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు నరసింహారావు నిన్న అంటే గురువారం టీడీపీలో చేరారు. దీంతో మాచర్ల మున్సిపల్ చైర్మన్‌గా పోలూరు నరసింహారావును ఈ రోజు కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నరసారావుపేట, ఆగస్ట్ 23: పల్నాడు జిల్లాలోని మాచర్ల మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 16 మంది వైసీపీ కౌన్సిలర్లు శుక్రవారం టీడీపీలో చేరారు. మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు నరసింహారావు నిన్న అంటే గురువారం టీడీపీలో చేరారు. దీంతో మాచర్ల మున్సిపల్ చైర్మన్‌గా పోలూరు నరసింహారావును ఈ రోజు కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Also Read: Assam: అసోంలో దారుణం.. బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు
Also Read: Uttar Pradesh: 40 మంది విద్యార్థులకు గాయాలు.. అయిదుగురి పరిస్థితి విషమం
దాంతో కొత్త కౌన్సిల్ ఏర్పాటుకు వీలుగా మున్సిపల్ చైర్మన్ పదవికి ఇటీవల ఏసోబు రాజీనామా చేశారు. గతంలో రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నుంచి 31 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిలో 16 మంది కౌన్సిలర్లు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Also Read: RG Kar Medical Hospital: వైద్యురాలి హత్యాచారం వేళ.. సీఎం మమత లేఖ వైరల్
Also Read: kolkata RG Kar Hospital: కపిల్ సిబల్‌కు బెంగాల్ కాంగ్రెస్ పార్టీ నేత కీలక సూచన
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం కొలువు తీరింది. ఇక జగన్ పార్టీకి ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అదీకాక.. గత జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించిన తీరుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వైసీపీకి చెందిన పార్టీ శ్రేణులు టీడీపీలో చేరుతున్నాయి.
Also Read: ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 23 , 2024 | 07:31 PM