YCP: మడకశిర వైసీపీలో ముసలం.. ఈర లక్కప్పపై తిప్పేస్వామి వర్గం ఆగ్రహం
ABN, Publish Date - Jan 25 , 2024 | 10:24 AM
మడకశిర వైఎస్ఆర్ సీపీలో అసమ్మతి రాజుకుంది. అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఈర లక్కప్పను నియమించడంతో విభేదాలు భగ్గుమన్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లా: మడకశిర వైఎస్ఆర్ సీపీలో అసమ్మతి రాజుకుంది. అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఈర లక్కప్పను (Eera Lakkappa) నియమించారు. దీనిని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సారా స్మగ్లర్‌కు బాధ్యతలు అప్పగిస్తారా అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిప్పేస్వామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు అతని స్థానంలో ఈర లక్కప్పను ఇంచార్జీగా నియమించడంతో తిప్పేస్వామి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటక నుంచి సారా తీసుకొస్తూ గతంలో ఈర లక్కప్ప పట్టుబడ్డారు. గుడిబండ మండలం ఇటికేపల్లి చెక్ పోస్ట్ వద్ద అతనిని పోలీసులు పట్టుకున్నారు. తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కర్ణాటక మద్యంతోపాటు గుడిబండ పోలీస్ స్టేషన్‌లో ఈర లక్కప్పపై పలు కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో లక్కప్ప రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ పార్టీతో మద్దతుతో గుడిబండ సర్పంచ్‌గా 2006లో గెలుపొందారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో వైసీపీలో చేరారు. 2015 నుంచి 2019 వరకు వైసీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్‌గా పనిచేశారు. ఇప్పుడు మడకశిర వైసీపీ అసెంబ్లీ టికెట్ ఖరారు అయ్యింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 25 , 2024 | 12:31 PM