ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: చిరంజీవితో మోదీ ఏం చెప్పారంటే..?

ABN, Publish Date - Jun 14 , 2024 | 07:09 PM

ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్, మంత్రుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. విశిష్ఠ అతిథిగా విచ్చేసిన మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదిక మీద ఉన్న ప్రధాని మోదీ చిరంజీవి వద్దకొచ్చి మాట్లాడారు

Megastar Chiranjeevi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్, మంత్రుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. విశిష్ఠ అతిథిగా విచ్చేసిన మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదిక మీద ఉన్న ప్రధాని మోదీ చిరంజీవి వద్దకొచ్చి మాట్లాడారు. వీరిద్దరూ ఏం మాట్లాడారు.? ఏ అంశాలపై చర్చించారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ సస్పెన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి తెరదించారు.


చిరు ఏమన్నారంటే..?

‘ప్రధాని మోదీతో మాట్లాడటం ఆనందంగా ఉంది. ఆయన మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఆ మాటలు మధుర జ్ఞాపకాలు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తమ్ముడు పవన్ కల్యాణ్‌ని ఇంటికి పిలిచాను. ఆహ్వానానికి సంబంధించిన వీడియో గురించి ప్రధాని మోదీ నన్ను అడిగారు. అన్నదమ్ముల ప్రేమ గురించి తెలిసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అన్నదమ్ముళ్ల అనుబంధం, కుటుంబ విలువలను ప్రతిబింబించేలా ఉన్నాయి. ఇదే విషయం తనతో మోదీ చెప్పారు అని’ మెగాసార్ట్ చిరంజీవి ట్వీట్ చేశారు.


సంబరపడ్డారు..

తమ మధ్య జరిగిన సంభాషణ ఇదేనని చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు. అన్నదమ్ముల ఆప్యాయత గురించి ప్రధాని మోదీ తెలిసి ఆనంద పడ్డారని వెల్లడించారు. వేదిక మీద చిరు, పవన్ కల్యాణ్‌తో మోదీ అభివాదం చేసిన సంగతి తెలిసిందే. చిరుతో ప్రత్యేకించి మాట్లాడటంతో ఏం జరుగుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

Updated Date - Jun 14 , 2024 | 07:32 PM

Advertising
Advertising