ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Marketing Minister Achchennaidu : జగన్‌... నీకు సిగ్గుందా?

ABN, Publish Date - Dec 06 , 2024 | 05:17 AM

‘ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గడించిన గుంటూరు మిర్చి యార్డులోకి వైసీపీ ప్రభుత్వ హయాంలో సంబంధం లేని వ్యక్తులు చొరబడ్డారు. అడుగడుగునా అవినీతికి పాల్పడి వ్యవస్థని కుప్పకూల్చారు’ అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

  • నీ హయాంలో వ్యవసాయానికి తాళం వేశావు

  • రైతులకు 1,600 కోట్లు అప్పు పెట్టిన దుర్మార్గుడివి

  • మిర్చియార్డులో భారీ అవినీతిపై విచారణ పూర్తయింది

  • నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు: అచ్చెన్న

  • మార్కెటింగ్‌ కమిషనరేట్‌లో ఉన్నతస్థాయి సమీక్ష

గుంటూరు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గడించిన గుంటూరు మిర్చి యార్డులోకి వైసీపీ ప్రభుత్వ హయాంలో సంబంధం లేని వ్యక్తులు చొరబడ్డారు. అడుగడుగునా అవినీతికి పాల్పడి వ్యవస్థని కుప్పకూల్చారు’ అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గురువారం ఉదయం గుంటూరులోని మార్కెటింగ్‌ కమిషనరేట్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మిర్చి యార్డు అవినీతిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజిలెన్స్‌ విచారణ వేశాం. ఆ శాఖ ఇప్పటికే విచారణ పూర్తి చేసి నివేదిక రూపొందించింది. నివేదిక అందగానే ఎవరెవరు ఈ కుంభకోణంలో భాగాస్వామ్యమై ఉన్నారో నిర్ధారించి చర్యలు తీసుకొంటాం. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పటి సీఎం జగన్‌ సర్వనాశనం చేశాడు. వ్యవసాయాన్ని తాళంతో బిగించి వ్యవస్థని ఛిన్నాభిన్నం చేశాడు. ఇప్పుడు నానా యాగీ చేస్తూ నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు. రైతుల సమస్యలపై ఆందోళన చేస్తానని చెప్పడానికి నీకు సిగ్గుందా? ఎక్కడికి వస్తావో రా... వ్యవసాయంపై చర్చిద్దాం.


మేము పీఎం ఫసల్‌ బీమాని రైతులందరికీ 3 శాతం చెల్లింపుతోనే అమలు చేస్తున్నాం. తొలిసారిగా మామిడి పంటకు కూడా ఈ బీమా పథకాన్ని వర్తింపు చేస్తున్నాం. ధాన్యం కొనుగోళ్ల మీద అరుస్తున్నావు. నువ్వు ధాన్యం కొని 5 నెలల పాటు చిల్లిగవ్వ కూడా రైతులకు చెల్లించలేదు. రూ.1,600 కోట్ల అప్పు పెట్టిన దుర్మార్గుడివి. మేము ఆ బకాయిలన్నీ చెల్లించి ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాం. 48 గంటల్లో డబ్బులు రైతు ఖాతాలో జమ చేస్తున్నాం. అలానే రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నీ అవినీతి అమెరికా వరకు వెళ్లింది. అందుకు సిగ్గు పడకుండా... ‘నేను చేసింది రాష్ట్రానికి మంచిది. నాకు సన్మానం చేయండి’ అని మాట్లాడేవాళ్లతో ఏమి రాజకీయం చేయగలం? ప్రకృతి విపత్తులు ఈ ఏడాది రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాయి. తాజాగా ఫెంగల్‌ తుఫానుతో తడిసిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసి రైతుని ఆదుకొనేందుకు నిర్ణయించాం’ అని మంత్రి అచ్చెన్న తెలిపారు. సమావేశానికి ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నజీర్‌ అహ్మద్‌, గళ్లా మాధవి, మార్కెటింగ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బుడితి రాజశేఖర్‌, కమిషనర్‌ విజయ సునీత హాజరయ్యారు.

Updated Date - Dec 06 , 2024 | 05:17 AM