ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యంగ్యాస్త్రాలు

ABN, Publish Date - Aug 07 , 2024 | 04:27 PM

మదనపల్లె ఫైళ్ల దహనం వ్యవహారంపై ప్రభుత్వ, విపక్ష పార్టీ వైసీపీ నేతల మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు. ‘‘తిన మరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లుగా ఉంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీరు’’ అంటూ మంత్రి వంగ్యాస్త్రాలు సంధించారు.

Anagani Satya Prasad

అమరావతి: మదనపల్లె ఫైళ్ల దహనం వ్యవహారంపై ప్రభుత్వ, విపక్ష పార్టీ వైసీపీ నేతల మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు. ‘‘తిన మరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లుగా ఉంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీరు’’ అంటూ మంత్రి వంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్లు తగులపెట్టించి అమాయక ముఖం పెడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. పాపాలు చేసి ఫైళ్లు తగులబెట్టడడం పెద్దిరెడ్డి అలవాటుగా చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి, అతని అనచరులకు వ్యతిరేకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.


మదన పల్లె ఫైళ్ల దహనం ఘటనకు ముందు కాలుష్య నియంత్రణ మండలిలో కూడా ఫైళ్లు తగలబెట్టారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రస్తావించారు. మదన పల్లె ఫైళ్ల దహనం ఘటన కుట్ర కోణంలో జరిగిందేనని అభిప్రాయపడ్డారు. సీఐడీ విచారణలో దోషులను కచ్చితంగా తేలుస్తామని, పెద్దిరెడ్డే కాదు... అంతకన్నా పెద్ద వారు ఉన్నా చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.


జగన్, ఆయన కార్యకర్తలకి భయమెందుకు?: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్, ఆయన కార్యకర్తలకి భయమెందుకు?. రెండు నెలలు గడవక ముందే రాష్ట్రపతి పాలన అంటున్నారు‌. సామాజిక బస్సుయాత్ర చేపట్టే అర్హత జగన్‌కి లేదు. జగన్ హయాంలో 28 మంది దళితులు అత్యాచారాలు, ఆపై హత్యలకు గురయ్యారు. 6 వేల మంది దళితులపై అత్యాచారాలు జరిగాయి. ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన వద్ద డ్రైవర్‌గా పనిచేసే దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని హతమార్చి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’’ అని కోటం శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. ‘‘జగన్ రూ.33 వేల కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారు. ఏపీ కోసం జగన్ ఏ రోజైనా రాష్ట్రపతిని కలిశాడా?. ఇవాళ రాష్ట్రపతి పాలన కావాలంటున్నాడు’’ అని అన్నారు.

Updated Date - Aug 07 , 2024 | 04:27 PM

Advertising
Advertising
<