Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంలో ఆ శాఖలో అవినీతిపై మంత్రి నాదెండ్ల ఆశ్చర్యం..
ABN, Publish Date - Jul 08 , 2024 | 08:08 PM
పౌరసరఫరాల శాఖలో అవినీతి, అక్రమాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అందించిన రేషన్ సరకుల్లో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి తెలుసుకుని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి.. ప్రజలకు ఇచ్చే పంచదార, కందిపప్పు, నూనె వంటి ప్యాకెట్ల తూకంలో తేడాలు గుర్తించి పంపిణీని ఆపేశారు.
విజయవాడ: పౌరసరఫరాల శాఖలో అవినీతి, అక్రమాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అందించిన రేషన్ సరకుల్లో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి తెలుసుకుని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి.. ప్రజలకు ఇచ్చే పంచదార, కందిపప్పు, నూనె వంటి ప్యాకెట్ల తూకంలో తేడాలు గుర్తించి పంపిణీని ఆపేశారు. తూకం తేడాలపై సంబంధింత అధికారులు, డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఆయన రాష్ట్రంలోని బియ్యం, కందిపప్పు, పంచదార వ్యాపారులతో ధరల నియంత్రణపై సమావేశం నిర్వహించారు. వారికి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరల పెరుగుదలపై ఆరా తీశారు. మార్కెట్‌లో ధరల స్థిరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. అనంతరం ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Updated Date - Jul 08 , 2024 | 08:08 PM