ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Roja: ‘నాన్ లోకల్ పొలిటీషియన్స్ వద్దు’.. చంద్రబాబుపై రోజా విమర్శలు

ABN, Publish Date - Jan 20 , 2024 | 04:22 PM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలను పందులతో పోలుస్తూ మంత్రి విమర్శలు గుప్పించారు.

విజయవాడ, జనవరి 20: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలను పందులతో పోలుస్తూ మంత్రి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు పందులు వస్తున్నట్లు గుంపులుగా వస్తున్నాయని... ఆ దొంగలకు.. పందులకు బుద్ది చెప్పాలంటూ వ్యాఖ్యలు చేశారు. కళాకారులు కళారూపంలో ఆ పని చేయాలన్నారు. అందరం జగనన్న కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ముక్కలు చేసి... అప్పులపాలు చేసి.. డబ్బులు హైదరబాద్‌లో దాచుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉండి చుట్టపు చూపుగా ఇక్కడికి వస్తున్నారని మండిపడ్డారు. ‘‘నాన్ లోకల్ పొలిటీషియన్స్ మనకు అక్కర లేదు’’ అంటూ మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు.


కళాకారులకు అండగా ఉంటాం...

కాగా.. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రోజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయాక కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదన్నారు. వారి డేటా గత ప్రభుత్వాలు తీసుకోనందున గుర్తింపు కార్డులు ఇవ్వలేదన్నారు. ఈ రోజు డేటా ఉంది కాబట్టి గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. గుర్తింపు కార్డు ఉంటే డప్పు కళాకారులకు పింఛను ఉంటుందన్నారు. కళాకారులకు అండగా ఉండాలనే జగన్ (CM Jagan) తనకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఏపీలో కళాకారులకు ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రక్క రాష్ట్రాల్లోనూ ఇవ్వలేదని మంత్రి రోజా పర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జోగి నాయుడు, అధికారులు, కళాకారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2024 | 04:22 PM

Advertising
Advertising