ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Kolikapudi Srinivasa Rao : బుడమేరు ముంపునకు వైఎస్‌ కుటుంబానిదే బాధ్యత

ABN, Publish Date - Sep 07 , 2024 | 04:31 AM

బుడమేరు వరదతో విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవడానికి, వైఎస్‌ కుటుంబం తప్పిదమే కారణమ ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు.

  • 1956లో రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రణాళికలు

  • అడ్డుకున్న రాజారెడ్డి బంధువు ‘బొల్లారెడ్డి’: ఎమ్మెల్యే కొలికపూడి

తిరువూరు, సెప్టెంబరు 6: బుడమేరు వరదతో విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవడానికి, వైఎస్‌ కుటుంబం తప్పిదమే కారణమ ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం ఆయన విజయవా డ రూరల్‌ ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, నూజివీ డు నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు తాగు, సాగు నీరు అందించేందుకు 1956 ఏప్రిల్‌ 11న అప్పటి ఎంపీ అల్లూరి సత్యనారాయణరాజు బుడమేరు డైవర్షన్‌ చాన ల్‌కు శంకుస్థాపన చేశారు. గణపవరం కొండల వద్ద నుంచి అనంతారం కొండల మధ్య వరకూ రిజర్వాయర్‌ నిర్మించి, ప్రకాశం బ్యారేజి కంటే పది రెట్లు నీరు నిల్వ ఉండేలా రూపొందించారు. అప్పట్లో వైఎస్‌ రాజారెడ్డి బంధువైన గణపవరం ప్రాంత జమిందారు బొల్లారెడ్డి కోటిరెడ్డి, ఆయన కుమారుడు వెంకటేశ్వరరెడ్డి... నీలం సంజీవరెడ్డితో ఉన్న సంబంధాలను అడ్డుపెట్టుకొని, బు డమేరు రిజర్వాయర్‌ నిర్మాణం జరగకుండా అడ్డుకున్నా రు. నేడు బుడమేరు ముంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవడానికి వైఎస్‌ కుటుంబం పాత్ర ఉంది. నాడు బుడమేరు రిజర్వాయర్‌ నిర్మాణాన్ని అడ్డుకున్న వైఎస్‌ కుటుంబానికి చెందిన జగన్‌.. ముంపు ప్రాంతాల్లో ప్రజల్ని అదుకునేందుకు చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తుంటే, కువిమర్శలు చేస్తున్నాడు’ అన్నారు

Updated Date - Sep 07 , 2024 | 04:31 AM

Advertising
Advertising