ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mopidevi Venkataramana: రాజీనామాకు ముందు మోపిదేవి సంచలన వ్యాఖ్యలు..

ABN, Publish Date - Aug 29 , 2024 | 11:22 AM

వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉన్న మోపిదేవి వెంకటరమణ.. ఆ పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీలో విసిగివేసారిపోయిన ఆయన గుడ్ బై చెప్పేశారు.. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన మోపిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్, వైఎస్ జగన్ పేర్లు ప్రస్తావించి మరీ.. ఇద్దరి మధ్య ఉన్న తేడాలను కూడా చెప్పుకొచ్చారు..

Mopidevi Venkataramana

అమరావతి/న్యూ ఢిల్లీ: వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) కుడి భుజంగా ఉన్న మోపిదేవి వెంకటరమణ.. (Mopidevi Venkataramana) ఆ పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీలో విసిగివేసారిపోయిన ఆయన గుడ్ బై చెప్పేశారు.. ఈ సందర్భంగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ఎక్స్‌క్లూజివ్ మాట్లాడిన మోపిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్లు ప్రస్తావించి మరీ.. ఇద్దరి మధ్య ఉన్న తేడాలను కూడా చెప్పుకొచ్చారు. కాగా.. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు మోపిదేవి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు.


బాంబ్ పేల్చారుగా!

వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వల్లే నేను జైలుకు వెళ్లాను. వైఎస్సార్‌కు, వైఎస్ జగన్‌కు చాలా తేడా ఉంది. నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. స్థానిక నేతగానే ఉండాలని నేను కోరుకున్నాను. వైఎస్ జగన్ రెడ్డే నన్ను రాజ్యసభకు పంపారు. నా రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయి. వైసీపీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను. మధ్యాహ్నం 12:30 గంటలకు కు రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా చేస్తాను. వైసీపీ ద్వారా సంక్రమించిన రాజ్యసభకు రాజీనామా చేస్తున్నాను. ఏ సందర్భంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నాను..? ఏమిటనేది..? వైసీపీ నేతలే ఆలోచించాలి. నేను తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో వైసీపీ వాళ్లే చెబుతారు. చిల్లరగా మాట్లాడే మనస్తత్వం నాది కాదు అని ఏబీఎన్‌తో మోపిదేవి చెప్పుకొచ్చారు.


రాజీనామా తర్వాత..

రాజ్యసభ పదవిపై నేను మొదటి నుంచి ఇంట్రెస్ట్‌గా లేను. ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరుతాను. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నాను. అనుభవం ఉన్న నేత సీఎం చంద్రబాబు.. రాజకీయ వ్యవస్థను, పాలనను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. చంద్రబాబు సారథ్యంలో పనిచేయాలని భావిస్తున్నాను. టీడీపీ నేతలకు కూడా నాతో చర్చించారు. రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గానికి వెళ్లి కార్యకర్తలను సమావేశం అవుతాను. గత ఏడాదికాలంగా నా నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాలతో చాలా ఇబ్బంది పడ్డాను. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులతో రాజీనామా చేస్తున్నానుఅని మోపిదేవి వెల్లడించారు.


అసలు కారణం ఇదేనా..?

వైసీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం బాపట్ల జిల్లాలో పెద్ద దిక్కుగా మోపిదేవి వ్యవహరించారు. అయితే జగన్‌ తీరుతో పార్టీలో ఇమడలేక పార్టీని వీడేందుకు సిద్ధమవటం ఆ పార్టీకి పెద్ద షాక్‌గా చెప్పవచ్చు. జగన్‌ సీఎం పదవిని చేపట్టక ముందు జైల్లో ఉన్న సమయంలో ఆయనతో పాటు మోపిదేవి తోటి ఖైదీగా ఉండి ఆయనకు మరింత సన్నిహితమయ్యారు. అందువల్లే ఆయన 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పరాజయం పాలైనా మంత్రి పదవిని కట్టబెట్టి ఆ తర్వాత ఎమ్మెల్సీని చేశారు. తదనంతర పరిణామాల్లో ఢిల్లీలో తనకు ఓ నమ్మకస్తుడు ఉండాలనే భావనతో ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించారు. అయితే 2024 ఎన్నికల్లో తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆకాంక్షను వ్యక్తం చేసినా ఆనాడు సీఎంగా ఉన్న జగన్‌ అందుకు నిరాకరించారు. కనీసం తన సోదరుడికైనా టికెట్‌ ఇవ్వాలని పట్టుపట్టినా జగన్‌ అంగీకరించలేదు. ఎన్నికలకు మందు రేపల్లెలో గణేష్‌ అభ్యర్థిత్వంలో పునరాలోచించాలని పలుమార్లు జగన్‌ను అభ్యర్థించారు. ఇదే విషయం మాట్లాడానికైతే మరోమారు తన వద్దకు రావద్దని అప్పటి సీఎం జగన్‌ ఎంపీ మోపిదేవికి చెప్పినట్లు, అదే విషయాన్ని తన అనుచరుల వద్ద చెప్పి ఎంపీ ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. తీరా చూస్తే.. ఈ వ్యవహారం మొత్తం రాజీనామాకు దారితీసింది.

Updated Date - Aug 29 , 2024 | 12:12 PM

Advertising
Advertising