Home » Mopidevi Venkataramana
TDP vs YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేతలు ఇద్దరు తెలుగు దేశం పార్టీలో చేరారు. బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వారిద్దరూ టీడీపీలో చేరారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది.
వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉన్న మోపిదేవి వెంకటరమణ.. ఆ పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీలో విసిగివేసారిపోయిన ఆయన గుడ్ బై చెప్పేశారు.. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన మోపిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్, వైఎస్ జగన్ పేర్లు ప్రస్తావించి మరీ.. ఇద్దరి మధ్య ఉన్న తేడాలను కూడా చెప్పుకొచ్చారు..
వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుడి భుజంగా మోపిదేవి వెంకటరమణ ఉన్నా రు. ఆ పార్టీకి గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం బాపట్ల జిల్లాలో పెద్ద దిక్కు గా వ్యవహరించారు. అయితే జగన్ తీరుతో పార్టీలో ఇమడలేకపోతున్న రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవటం ఆ పార్టీకి పెద్ద షాక్‌గా చెప్పవచ్చు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ పార్టీ నేతలు భారీ షాకిచ్చారు.