ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Multi-Disciplinary Committee : ఆ బియ్యం ఎక్కడివో తేలుస్తాం!

ABN, Publish Date - Dec 04 , 2024 | 06:10 AM

కాకినాడ పోర్టులో వివాదాస్పదంగా మారిన స్టెల్లా ఎల్‌ నౌక వ్యవహారంపై సమగ్ర తనిఖీలు చేసేందుకు ప్రభుత్వంలోని ఐదు శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశామని కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ తెలిపారు.

  • స్టెల్లా ఎల్‌ నౌకలో తనిఖీల కోసం మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు

  • పోర్టుకు వచ్చే ప్రతి లోడుపైనా నిఘా

  • కాకినాడ కలెక్టర్‌ షాన్‌మోహన్‌ వెల్లడి

కలెక్టరేట్‌ (కాకినాడ), డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడ పోర్టులో వివాదాస్పదంగా మారిన స్టెల్లా ఎల్‌ నౌక వ్యవహారంపై సమగ్ర తనిఖీలు చేసేందుకు ప్రభుత్వంలోని ఐదు శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశామని కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ తెలిపారు. ఆ నౌకలో గుర్తించిన బియ్యం గతంలో సీజ్‌ చేసి బ్యాంకు గ్యారెంటీపై విడుదల చేసిన రేషన్‌ బియ్యామా కాదా అనే కోణంలో పరిశీలన చేపడుతున్నామని పేర్కొన్నారు. కాకినాడ పోర్టుకు వచ్చే బియ్యం ప్రతి లోడునూ కమిటీ తనిఖీ చేస్తుందని స్పష్టం చేశారు. కాకినాడ కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘గతనెల 27న కాకినాడ ఆర్డీవోతో కలిసి స్టెల్లా ఎల్‌ నౌకలో జరిపిన తనిఖీలో పీడీఎస్‌ బియ్యం బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై విచారణకు రెవెన్యూ, పోలీసు, కస్టమ్స్‌, పౌరసరఫరాలు, పోర్టు అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ నౌకలో ఉన్న మొత్తం బియ్యాన్ని తనిఖీ చేసి నివేదిక సమర్పిస్తుంది. అలాగే ఎగుమతిదారులు, మిల్లులకు సంబంధించిన బిల్లులు, ఎగుమతిదారులు నిల్వ ఉంచిన గోదాముల నుంచి భారీ నౌక వరకు జరిపిన రవాణాకు సంబంఽధించిన ట్రాక్‌ షీట్లు తనిఖీ చేస్తాం. ఈ తనిఖీ ద్వారా నౌకలో ఉన్నది పీడీఎస్‌ బియ్యామా కాదా అనేది తేలుతుంది’’ అని కలెక్టరు వివరించారు. ప్రస్తుతం స్టెల్లా ఎల్‌ నౌక పోర్టు ఆధీనంలోనే ఉన్నదని, కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు కాకినాడ పోర్టు నుంచి అక్రమ ఎగుమతులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాకినాడ పోర్టుకు వచ్చే బియ్యాన్ని 24 గంటలూ తనిఖీలు చేసేవిధంగా మూడు షిప్ట్‌ల్లో టీమ్‌లను నియమిస్తున్నామన్నారు. పీడీఎస్‌ రైస్‌ తరలిస్తున్నట్లు గుర్తిస్తే ఆ వాహనాన్ని ఈ టీమ్‌లు సీజ్‌ చేస్తాయన్నారు. ఆ లోడ్‌ ఏ గోదాము నుంచి వచ్చిందో చూసి అక్కడి స్టాక్‌ను కూడా సీజ్‌ చేస్తామన్నారు.

Updated Date - Dec 04 , 2024 | 06:10 AM