ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nara Bhuvaneshwari: సంక్షేమం పేరిట దోచేశాడు

ABN, Publish Date - Apr 12 , 2024 | 09:39 AM

‘సంక్షేమం పేరుతో నిధులన్నీ దోచేసింది చాలక రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేశాడు. హైకోర్టు మినహా ఏమీ మిగలనివ్వలేదు. మొత్తం దోచేసి జేబులు నింపుకొని తినేస్తున్నాడు. ఇక మిగిలింది ప్రజల ఆస్తులే. అవైనా ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. చంద్రబాబు తెచ్చిన పఽథకాలను ఆపేసి పేదల జీవితాల్లో అంధకారం నింపిన రాక్షసుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఇలాంటి రాక్షసుణ్ణి తరిమేయడానికి రేపటి ఎన్నికల్లో ఓటనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) పిలుపునిచ్చారు.

● హైకోర్టు తప్ప జగన్‌ అన్నీ తాకట్టు పెట్టేశాడు

● ‘నిజం గెలవాలి’ యాత్రలో నారా భువనేశ్వరి

తెనాలి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ‘సంక్షేమం పేరుతో నిధులన్నీ దోచేసింది చాలక రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేశాడు. హైకోర్టు మినహా ఏమీ మిగలనివ్వలేదు. మొత్తం దోచేసి జేబులు నింపుకొని తినేస్తున్నాడు. ఇక మిగిలింది ప్రజల ఆస్తులే. అవైనా ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. చంద్రబాబు తెచ్చిన పఽథకాలను ఆపేసి పేదల జీవితాల్లో అంధకారం నింపిన రాక్షసుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఇలాంటి రాక్షసుణ్ణి తరిమేయడానికి రేపటి ఎన్నికల్లో ఓటనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) పిలుపునిచ్చారు.

నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో పర్యటించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో గుండె ఆగి మరణించిన దాచేపల్లి శివరామయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం ప్రజల్ని ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, రౌడీ మూకలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. పేదల కోసం అన్న క్యాంటీన్లు పెడితే వాటిని కూడా మూయించిన జగన్‌ను రాక్షసుడు అని కాకుండా మరేమనాలని ప్రశ్నించారు. జగన్‌ అరాచకాలను అడ్డుకోవాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 09:39 AM

Advertising
Advertising