ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Bhuvaneshwari: విద్యార్థుల్లో.. విద్యార్థిగా..!

ABN, Publish Date - Jun 29 , 2024 | 04:31 AM

ఎన్నికల సందర్భంగా సేవా కార్యక్రమాలకు కాస్త విరామం ఇచ్చిన సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి..

  • పాగోలు ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ సందర్శించిన భువనేశ్వరి

  • వసతులపై ఆరా.. విద్యార్థినులతో కలిసి భోజనం

చల్లపల్లి/భట్టిప్రోలు, జూన్‌ 28: ఎన్నికల సందర్భంగా సేవా కార్యక్రమాలకు కాస్త విరామం ఇచ్చిన సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి.. మరలా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ను ఆమె సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. తరగతి, హాస్టల్‌ గదులను సందర్శించి అక్కడున్న వసతులను పరిశీలించారు. భోజనశాలలో పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. అనాధలు, తల్లిదండ్రులను పోగొట్టుకున్న టీడీపీ కార్యకర్తల పిల్లలకు ఇక్కడి స్కూల్‌లో చదువు చెబుతున్నామని తెలిపారు. ఇక్కడ చదివిన భవఘ్నసాయి అనే విద్యార్థిని ఇటీవల పదో తరగతి పరీక్షల ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించినట్టు చెప్పారు. కాగా.. బాపట్ల జిల్లా భట్టిప్రోలులోని హెరిటేజ్‌ పాల శీతలీకరణ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. హెరిటేజ్‌ సంస్థకు పాలు పోసే ప్రతి రైతు లబ్ధి పొందడమే లక్ష్యంగా సంస్థ పని చేస్తుందన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 04:31 AM

Advertising
Advertising