ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nara Lokesh: విశాఖ వైసీపీ నేతలపై లోకేశ్ ఫైర్

ABN, Publish Date - Apr 13 , 2024 | 03:17 PM

విశాఖ‌ప‌ట్ట‌ణంలో వైసీపీ అఘాయిత్యాల‌కు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జీవీఎంసీ 65వ డివిజన్ నివాసి జ‌లుమూరి రాధ‌పై అదే వార్డు వైసీపీ అధ్య‌క్షుడు మొద‌ల‌వ‌ల‌స లోక‌నాథం పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం చాలా దారుణమన్నారు. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో సొంత త‌ల్లి వైయస్ విజయమ్మకు, చెల్లి వైయస్ షర్మిలకే ర‌క్ష‌ణ‌ లేదని చెప్పారు.

Nara Lokesh

అమరావతి, ఏప్రిల్ 13: విశాఖ‌ప‌ట్ట‌ణంలో వైసీపీ అఘాయిత్యాల‌కు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. జీవీఎంసీ 65వ డివిజన్ నివాసి జ‌లుమూరి రాధ‌పై అదే వార్డు వైసీపీ అధ్య‌క్షుడు మొద‌ల‌వ‌ల‌స లోక‌నాథం పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం చాలా దారుణమన్నారు.

జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో సొంత త‌ల్లి వైయస్ విజయమ్మకు, చెల్లి వైయస్ షర్మిలకే ర‌క్ష‌ణ‌ లేదని చెప్పారు. అలాంటిది.. రాధ‌లాంటి సామాన్య మ‌హిళ‌ల‌కు ఇంకెక్క‌డ రక్షణ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఇంటి పట్టాకు లంచం ఎందుకు ఇవ్వాల‌ని నిల‌దీసిన రాధ‌ను సదరు వైసీపీ నేత సజీవ‌ద‌హ‌నం చేయాల‌నుకోవ‌డం.. రాష్ట్రంలో జగన్ పార్టీ చేస్తున్న అరాచ‌కాల‌కు అద్దంప‌డుతోందన్నారు.

Nara Lokesh: నీ ప్రచారం పిచ్చి తగలెయ్యా.. ఆఖరుకు ఆయన్నూ వదలలేదా..

ఈ ఘటనలో నిందితుడైన లోక‌నాథంతోపాటు అతడికి సహకరించిన వైసీపీ నేత‌ల‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అయితే కాలిన గాయాల‌తో ఆసుపత్రిలో చికిత్స పొందున్న బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని.. ఆమె ప్రాణాలు కాపాడాలని వైద్యులకు నారా లోకేశ్ విజ్జప్తి చేశారు.

Elections 2024: అభ్యర్థి అవినాశ్ ను మార్చేందుకు యత్నాలు.. కుండ బద్దలు కొట్టిన షర్మిల..

విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో రాధకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ క్రమంలో ఇంటి పట్టా పొందేందుకు ఆమెను స్థానిక వైసీపీ నాయకుడు లోకనాథం నగదు డిమాండ్ చేశారని సమాచారం. ఆ క్రమంలో నగదు ఎందుకు ఇవ్వాలంటూ లోకనాథాన్ని రాధా నిలదీసింది. దీంతో ఆగ్రహించిన లోకనాథంతోపాటు అతడి అనుచరులు.. రాధపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే స్పందించి.. బాధితురాలు రాధాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 13 , 2024 | 04:12 PM

Advertising
Advertising