Nara Lokesh: రెండో సంతకంతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాం
ABN, Publish Date - May 05 , 2024 | 08:21 PM
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆదివారం ఏలూరులో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు.
ఏలూరు, మే 05: టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆదివారం ఏలూరులో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రజలు హాజరయ్యారు. ఆ క్రమంలో పలువురు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అందులోభాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తామంతా నష్టపోతామంటూ సాప్ట్‌వేర్ ఇంజినీర్ శేషనాయుడు ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో లోకేశ్ పైవిధంగా స్పందించారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌కు ఇచ్చిన ఒక్క అవకాశం వలన మనం చాలా నష్టపోయామని లోకేశ్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతీ ఓటు ముఖ్యమేనని ఆయన స్పష్టం చేశారు. అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలుకు సూచించారు. అయితే సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కుతూనే ఉంటాడు.. కానీ నగదు పడదన్నారు. గతంలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Amith Shah: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారింది
రాష్ట్రంలో స్కూల్స్‌ని సైతం బలోపేతం చేస్తామని చెప్పారు. అలాగే స్కూల్స్ రేషనైలేజేషన్ రద్దు చేస్తామని నారా లోకేశ్ ఈ సందర్భంగా ప్రకటించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యా విధానాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు ఎప్పుడు వస్తాయని ఆ శాఖ మంత్రిని అడిగితే, కోడి గురించి, గుడ్డు గురించి చెబుతారని.. ఇది ఆ మంత్రిగారి పరిస్థితని వ్యంగ్యంగా అన్నారు.
Third Phase polling: మూడో దశ పోలింగ్.. ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులు
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. వంద రోజుల్లో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తాయని చెప్పారు. అయితే ఈ ప్రభుత్వ హయాంలో చాలా ఇబ్భందులు ఎదుర్కుంటున్నామని ఓ దంత వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ఈ జగన్ ప్రభుత్వం పాస్ కాలేదు.. ఫెయిలయ్యిందన్నారు. ఇంతలో లోకేశ్ స్పందిస్తూ.. ఈ ప్రభుత్వమే కాదు ముఖ్యమంత్రి కూడా హైస్కూల్ చదువులో ఫెయిల్ అయ్యారని గుర్తు చేశారు.
Digvijaya Singh: హిందూ - ముస్లిం వివాదంపైనే ‘మోదీ రాజకీయం’
ఇక కార్పొరేటర్ జుజ్జువరపు రమేష్.. 30, 40 ఇళ్లు ఆక్రమించుకున్నాడని లోకేశ్‌కు ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై అతడిని ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నాడంటూ ఆ విద్యార్ధిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై విచారణ జరిపిస్తామన్నారు. అందుకోసం అవసరమైతే జ్యూడిషియల్ విచారణ చేయిస్తామని ఆ విద్యార్థినికి లోకేష్ హామీ ఇచ్చారు. ఎవరిని వదిలేది లేదన్నారు. అందరి పేర్లు రెడ్ బుక్‌లో రాశానని నారా లోకేశ్ ఈ సందర్భంగా వివరించారు.
summer season: కారు కడగడంపై నిషేధం విధించిన ప్రభుత్వం.. ఏ రాష్ట్రంలో అంటే..
ఇక మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. అందుకోసం అవసరమైతే.. సుప్రీంకోర్టులో పెద్ద లాయర్లను పెట్టి.. అవి అమలయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని చెప్పారు.
Lok Sabha Elections: నేటితో ప్రచారానికి తెర.. ఎల్లుండే మూడో దశ పోలింగ్
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారడానికి గంజాయి ప్రధాన కారణమని లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి మాఫియా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రాష్ట్రంలోనే గంజాయి అనేది లేకుండా చేస్తామని ప్రజలకు నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
Hardeep Nijjar Murder: భారతీయులు అరెస్ట్.. స్పందించిన జై శంకర్
మీ రాష్ట్రానికి రాజధాని ఏదని ఇతర రాష్ట్రాల వారు ప్రశ్నిస్తున్నారని.. వారికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో తామున్నామంటూ ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి పనులు ఊపందుకొంటాయని లోకేశ్ స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు సీయంగా ఉన్న సమయంలో దళితులపై ఒక్క దాడి కూడా జరగలేదనే గుర్తు చేశారు.
PrajaGalam: ధర్మవరం వేదికగా పోలవరంపై అమిత్ షా కీలక ప్రకటన
తెలుగుదేశం పార్టీ ఓ యూనివర్శిటీ అని నారా లోకేశ్ ఈ సందర్బంగా అభివర్ణించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు ఈ యూనివర్శిటీ నుంచి వచ్చిన వారేనని లోకేశ్ పేర్కొన్నారు. తాను 2019 వరకు పోలీస్ స్టేషన్‌కే వెళ్లలేదన్నారు. కానీ ఆ తర్వాత 6, 7 సార్లు వెళ్లానని తెలిపారు. ఇంకా చెప్పాలంటే. పోలీస్ స్టేషన్ నాకు అత్తారిల్లుగా మారిందని లోకేశ్ చత్కరించారు.
Read National News and Telugu News
Updated Date - May 05 , 2024 | 08:21 PM