ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: వైసీపీకి మరో బిగ్ షాక్.. నరసరావుపేట ఎంపీ లావు రాజీనామా

ABN, Publish Date - Jan 23 , 2024 | 10:59 AM

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు లోక్ సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

గుంటూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి (YCP) మరో షాక్ తగిలింది. నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు (Lavu Sri Krishna Devarayalu) పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని లావు శ్రీ కృష్ణ దేవరాయులు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేశానని స్పష్టంచేశారు.

గత కొద్దిరోజుల నుంచి శ్రీ కృష్ణ దేవరాయులు పార్టీ పెద్దల తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రావడం కష్టమేనని ఆయన భావించారు. గత 15 రోజులుగా పార్టీలో అనిశ్చితి నెలకొందని శ్రీ కృష్ణ దేవరాయులు చెబుతున్నారు. తన టికెట్ విషయమై క్యాడర్‌లో కన్‌ఫ్యూజన్ ఏర్పడిందని వివరించారు. అనిశ్చితికి తెరదించాలనే ఉద్దేశంతో పార్టీకి రాజీనామా చేశానని వివరించారు. నరసరావుపేటకు కొత్త అభ్యర్థిని తీసుకుని రావాలని హైకమాండ్ భావించింది. దాంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి, ఎంపీ పదవీకి రాజీనామా చేశానని స్పష్టంచేశారు. ఏ పార్టీలో చేరతాననే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 23 , 2024 | 11:12 AM

Advertising
Advertising