ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Raghu Rama Krishnam Raju: చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తే..జగన్, పాల్ పిచ్చాసుపత్రిలో చేస్తారు

ABN, Publish Date - May 23 , 2024 | 03:26 PM

రాష్ట్రంలో ఇటివల ఎన్నికలు పూర్తి కాగా, అందరూ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు అనేక రకాల రిపోర్టులను వెల్లడించాయి. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమరావతిలో తప్పకుండా ప్రమాణస్వీకారం చేస్తారని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు సీఎం జగన్, పాల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

aghu Rama Krishnam Raju

రాష్ట్రంలో ఇటివల ఎన్నికలు పూర్తి కాగా, అందరూ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు అనేక రకాల రిపోర్టులను వెల్లడించాయి. కానీ ప్రజలు మాత్రం ఎవరికీ పట్టం కట్టారో తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చేది మాత్రం తప్పకుండా టీడీపీ కూటమి అని నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణం రాజు(Raghu Rama Krishnam Raju) ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమరావతిలో తప్పకుండా ప్రమాణస్వీకారం చేస్తారని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.


టీడీపీ కూటమికి 125 సీట్లు తగ్గకుండా వస్తాయని రఘు రామకృష్ణం అన్నారు. అదే సమయంలో విశాఖపట్నం(visakhapatnam)లో జగన్, కేఏ పాల్ పిచ్చి ఆసుపత్రిలో ప్రమాణ స్వీకారం చేస్తారని రాజు ఎద్దేవా చేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రిగ్గింగ్ ఆపడానికి వెళ్లారని సాక్షిలో రాయడం విడ్డూరంగా ఉందన్నారు. రిగ్గింగ్ ఆపడానికి వెళ్లిన ఆయన పారిపోవాల్సిన పని ఏముందని ఈ సందర్భంగా రఘురామ ప్రశ్నించారు. వారి పార్టీలో ఉన్నవారు ఎన్ని తప్పులు చేసినా కూడా వారికి మాత్రం కనిపించడం లేదని దుయ్యబట్టారు.


ఇది కూడా చదవండి:

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.


For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 03:34 PM

Advertising
Advertising