ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anam; జగన్ ప్రమేయం లేకుండా ఇది జరగదు: ఆనం వెంకట రమణారెడ్డి

ABN, Publish Date - Dec 05 , 2024 | 02:05 PM

వైసీపీ నేతలు కత్తులు, గన్నులతో కేవీరావును అన్ని విధాలా బెదిరించి భయపెట్టి 4 వేల ఎకరాల భూమిని కేవలం 12 కోట్ల రూపాయల పేరుతో అప్పనంగా కొట్టేశారని ఆక్వాకల్చర్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు.

నెల్లూరు: కాకినాడ సెజ్, పోర్టు (Kakinada SEZ, Port) ఆక్రమణల కేసు (Case)లో జగన్‌ (Jagan)ను ఏ1 (A!)గా ఎఫ్‌ఐఆర్‌ (FIR)లో సీఐడీ (CID)చేర్చాలని ఆక్వాకల్చర్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి (Anam Venkata Ramana Reddy ) డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు పందుల గుంపు మాదిరి 8320 ఎకరాల కాకినాడ సెజ్ దోపిడీకి దిగారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్బంగా గురువారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. కత్తులు, గన్నులతో కేవీరావును అన్ని విధాలా బెదిరించి భయపెట్టి 4 వేల ఎకరాల భూమిని కేవలం 12 కోట్ల రూపాయల పేరుతో అప్పనంగా కొట్టేశారని ఆరోపించారు. భారతదేశంలో రూ.29 వేలకు ఎక్కడా దొరకని ఎకరా భూమి జగన్ వర్గీయులకు మాత్రమే కాకినాడ సెజ్‌లో ఎలా దొరుకుతుందని ఆయన ప్రశ్నించారు. డబ్బులు సంపాదించే కంపెనీని బెదిరించి గుంజుకోవటం వీరి నైజమని అన్నారు.


ప్రముఖ కన్సల్టెంట్ రోహిత్ చతుర్వేది ఇచ్చిన నివేదిక ప్రకారం కాకినాడ సెజ్‌లో ఎకరా రేటు రూ. 50 లక్షల పైచిలుకు ఉందని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. 2 వేల కోట్ల రూపాయల విలువైన కేవీరావు వాటా భూమిని రూ.12 కోట్లు ఇస్తామని చెప్పి కొట్టేశారన్నది సుస్పష్టమన్నారు. చెక్ రూపంలో ఇచ్చిన రూ. 12 కోట్లు కూడా 6 నెలల తర్వాత బ్యాంకులో జమ చేసుకోమనటాన్ని దోపిడీ అనాలా దొంగతనం అనాలా.. చెక్ రూపంలో ఇచ్చిన రూ. 12 కోట్లు 6 నెలల తర్వాత జమ కావటం సాధ్యమా.. అని ప్రశ్నించారు. జగన్ ప్రమేయం లేకుండా ఇది జరగని పని అని, కాకినాడ పోర్టు కైవసం కోసం భారీ మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒకే కంపెనీని ఇద్దరు కన్సెల్టెంట్లు ఆడిట్ చేసి వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాలని ఒత్తిడి తెచ్చారని, అలా కట్టని పక్షంలో పోర్టు స్వాధీనం చేయాలని బెదిరించి లొంగతీసుకోవటంతో పాటు షిప్పింగ్ ఏజెంట్లను భయపెట్టారని, కేవీరావు వాటా అమ్మే వరకూ గొంతుమీద కత్తి పెట్టి మరీ బెదిరించారని ఆనం వెంకట రమణారెడ్డి దుయ్యబట్టారు.


కాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (YSRCP MP Vijayasai Reddy)పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ (CID) విభాగం లుక్ ఔట్ సర్క్యులర్ (Lookout notices) జారీ చేసింది. ఆయనతోపాటు వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) కుమారుడు విక్రాంత్ రెడ్డి (Vikranth Reddy), అరబిందో యజమాని శరత్ చంద్ర రెడ్డి‌ (Sarath Chandra Reddy)పై ఎల్వోసీ (LOC) ఇచ్చింది. ఈ ముగ్గురూ విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యూలర్ జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ. 3,600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు, కేవీ రావు నుంచి గత ప్రభుత్వ హాయంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో కీలక నిందితులుగా వీరున్నారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కేవీ రావును బెదిరించి, భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థ సొంతం చేసుకుందనేది ప్రధాన అభియోగం.

దీనిపై కేవీ రావు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి.. ఈ ముగ్గురు కీలక నిందితులుగా ఉన్నారు. కేవీ రావు స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేస్తున్నారు. విక్రాంత్ రెడ్డిపై ఇప్పటికే సీఐడీ గురిపెట్టింది. కేవీ రావుతోపాటు మరికొందరి స్టేట్‌మెంట్లు కూడా రికార్డు చేయాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. అధికారులు కేసు రిజిష్టర్ చేసిన వెంటనే లుకౌట్ నోటీసులుజారీ చేశారు. ఈ ముగ్గురు విదేశాలకు పారిపోకుండా దేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు ఎల్వోసీలు పంపినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. వారిని విచారించేందుకు త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలియక తప్పు చేశా క్షమించండి: ఓ యువతి

నెల్లూరు: డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ లీలలు

ప్రభుత్వ చర్యలపై లోకాయుక్త సంతృప్తి

సీఎం చంద్రబాబుకు రామకృష్ణ లేఖ

బీఫ్ వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 05 , 2024 | 02:05 PM