Cyclone: తుపాను ప్రభావంతో భారీ వర్షాలు
ABN, Publish Date - Oct 14 , 2024 | 08:12 AM
బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపాన్ ప్రజావంతో రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిందని కలెక్టర్ ఆనంద్ చెప్పారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు. తుఫాన్ వచ్చినట్లయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడా నికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
మూడు రోజులపాటు కురిసే అవకాశం
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
వెబెక్స్ సమావేశంలో నెల్లూరు కలెక్టర్ ఆనంద్ సూచనలు
నెల్లూరు జిల్లా: అల్పపీడనం (Low pressure), తుఫాను (Cyclone) ప్రభావంతో నెల్లూరు జిల్లాలో అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, జేసీ కార్తీక్ తీర ప్రాంతాలు, పెన్నా తీరంపై ప్రత్యేక దృష్టి సారించారు. మత్స్య కారులు సముద్రంలో చేపల వేటకి వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు. వేటకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని ఆదేశించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఆదివారం ఆయన వెబెక్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు. తుఫాన్ వచ్చినట్లయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడా నికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
* పెన్నానది గట్లను పరిశీలించాలి
పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పెన్నా నది గట్లను పరిశీలించాలన్నారు. గట్లు బలహీనంగా ఉన్నా, గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పెన్నాకి వరద వస్తే నదీ పరివాహక ప్రాంతంలో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. యజమానులతో మాట్లాడి బోట్లు, ఎక్స్కవేటర్లను సిద్ధంగా ఉంచుకో వాలని ఆదేశించారు. వాటి తరలింపునకు వాహనాలను, మనుషులను సిద్ధంగా చేసుకోవాలన్నారు. ప్రాణనష్టంకాని, పశునష్టం కాని జరకుండా చూడాలన్నారు. నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, పాలు, కూరగాయల వాహనాలు, పెట్రోలు, డీజిల్ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్రామాల్లోని తాగునీటి ట్యాంకుల్లో ముందుగా నీటిని నింపుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
* తీరప్రాంత గ్రామాల్లో...
తీరప్రాంత గ్రామాల్లో టామ్ బామ్ ద్వారా, మైన్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. బారీ వర్షాలు సంభవిస్తే సురక్షిత ప్రాంతాలకు ప్రజలు చేరుకోవాల న్నారు. తీర ప్రాంతాల్లో పూరి గుడిసెలు, తాటాకు ఇళ్లలో ఉండే ప్రజలు పక్కా భవనాల్లోకి, తుపాన్ షెల్టర్లలోకి వెళ్లాలన్నారు. వైద్యశాలల్లో అత్యవసర మందులు, పాముకాటుకు మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆర్ అండ్ బీ, విద్యుత్, ఇరిగేషన్ శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదన్నారు. వేటకు వెళ్ళినవారు తిరిగి వచ్చేయాలని సూచించారు.
* సెలవుల రద్దు
జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు సెలవుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసుకుని హెచ్ క్వార్టర్లలో అందుబాటులో ఉండా బని కలెక్టర్ ఆదేశించారు.
* కంట్రోల్ రూము ఏర్పాటు
నెల్లూరు కలెక్టరేట్ కంట్రోల్ రూము ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ మూడు పిపులలో సిబ్బందికి డ్యూటీలు వేశామన్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు 0861-2381281. 1966376699, 1077గా పేర్కొన్నారు. డివిజన్, మం డల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆర్టీవోలు, తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.
* నేటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు:
తుఫాన్ కారణంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కానేదిక కార్యక్రమాన్ని రద్దు చేశామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ వెబెర్స్ సమావేశంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
* మూడు మిల్లీమీటర్ల వర్షం
జిల్లాలో ఆదివారం మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా మర్రిపాడులో 32 మి.మీ, అత్యల్పంగా గుడ్లూరులో 2.2 మిమీ వర్షపాతం నమోదైంది.
విద్యుత్ శాఖ అప్రమత్తం : ఎస్ఈ విజయన్
నెల్లూరు జిల్లాకు తుపాన్ ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరినీ అప్రమత్తం చేసి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్ తెలిపారు. ఆదివారం ఆయన చాంబర్ నుంచి జిల్లాలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం జిల్లాపై అధికంగా ఉంటుందని, వాతావరణ శాఖ నుంచి హెచ్చ రికలు ఉన్నందున అన్ని ప్రాంతాల్లో అధికా రులంతా పూర్తి అప్రమత్తంగా ఉండాల న్నారు. షిఫ్ట్ ఆపరేటర్లు, కాంట్రాక్ట్, ప్రైవేటు సిబ్బందిని అందుబాటులో ఉంచు కోవా లన్నారు. ఏ ప్రాంతంలో ఇబ్బంది జరిగిన వెంటనే స్పందించేలా అధికారులందరూ అందుబాటులో ఉండాలన్నారు.
Updated Date - Oct 14 , 2024 | 10:06 AM